20, డిసెంబర్ 2012, గురువారం

శాంతి – భండారు పర్వతాలరావు


శాంతి – భండారు పర్వతాలరావు

మన కొంపలపై బాంబులు
మన పచ్చని పైరుల మంటలు
మన పల్లెల పరుల మిలట్రీ
మన చెల్లికి దుర్మార్గుల చెర
జాబిల్లికి విషవాయువు తెర

మానవ జీవితాల బ్రహ్మజెముడు ముళ్లు
మనిషికీ మనిషికీ మధ్య ఎందుకోయి ఈ గళ్ళు
వద్దు! ప్రళయాన్ని ప్రసవించగల పొరపాట్లు
వద్దు! విలయపుటంచుల వివేకపు కప్పదాట్లువద్దు వద్దు మనకీ యుద్ధం!
కావలసినదొకటే శాంతి
జగమంతయు వెలుగగ క్రాంతి!
(విశాలాంధ్ర: ఫిబ్రవరి, 1963)

కామెంట్‌లు లేవు: