25, ఆగస్టు 2021, బుధవారం

ఆగస్టు 25న ఏం జరుగుతుంది?

 ఏపీ  ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన రెడ్డికి బెయిలా! జెయిలా అంటూ మీడియాలో చాలా రోజులనుంచి  తీవ్రాతితీవ్రంగా చర్చలు సాగుతూ వచ్చాయి. ఎందుకంటే ఆ రోజున సీబీఐ కోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇస్తుందని లోగడే ప్రకటించడం జరిగింది.  

గతంలో ఒకసారి శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక నేపధ్యంలో, డిసెంబరు 31 తరువాత ఏం జరుగుతుంది? అని ఢిల్లీలో విలేకరులు అడిగిన ప్రశ్నకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జవాబిస్తూ, ‘ఏం జరుగుతుంది, జనవరి ఒకటి వస్తుంది’ అని చెప్పడం గుర్తుకువస్తోంది.

చివరికి 25న ఏం జరిగింది అంటే, తీర్పును వచ్చేనెల (సెప్టెంబరు) పదిహేనుకు  సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

(25-08-2021)

 

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

వాయిదాపడటం అందరికీ ముందే ఊహించిన సంగతే. ఈ justice delayed విధానంతో justice denied ఈదేశంలో ముఖ్యంగా పలుకుబడికల నే‌రగాళ్ళ విషయంలో. అందకే దేశంలో నేరమయం ఆవుతున్నాయి వ్యవస్థలన్నీ. కాదంటారా?