1, డిసెంబర్ 2016, గురువారం

మోడీ గెలవాలి


నల్లధనంపై మొదలు పెట్టిన పోరాటంలో నరేంద్ర మోడీ గెలవాలి. గెలిచి తీరాలి. ఇది మోడీ అభిమానులు కోరుకుంటున్నదే కాదు ఆయన్ని నరనరాన ద్వేషించే వాళ్ళు  సైతం ఇదే  కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ ఈ ప్రయత్నంలో  విఫలం అయితే ఆ ప్రభావం ఆయనకూ, ఆయన పార్టీకి మాత్రమే  కాదు యావత్  దేశానికీ చుట్టుకుంటుంది. ప్రపంచ దేశాల్లో ఈనాడు ఎన్నదగిన ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ వస్తున్న భారత దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కు పోతుంది. మళ్ళీ కోలుకోవాలన్నా, కనీసం ఈనాడు వున్న స్తితికి చేరుకోవాలన్నా ఏండ్లూపూ౦డ్లూ పట్టే ప్రమాదం వుంది. కారణం మోడీ స్వారీ చేస్తున్నది భయంకరమైన, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న నల్లధనం అనే రక్కసి పులి మీద. మోడీ జయిస్తే పరవాలేదు. కానీ పులిదే పై చేయి అయితే, పరవాలేదు అని చెప్పుకోవడానికి కూడా ఏమీ మిగలదు. నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పినా, విధి వశాత్తు రాజకీయాల్లోకి వచ్చిన సుప్రసిద్ధ ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ చెప్పినా ఇదే!

అభిమాన దురభిమానాలు పక్కనబెట్టి, రాజకీయాలకు అతీతంగా  మోడీ విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. మనకోసం కాదు మన దేశ భవిష్యత్తు కోసం. భవిష్యత్ తరాల భద్రతకోసం. 

15 కామెంట్‌లు:

sarma చెప్పారు...

''అభిమాన దురభిమానాలు పక్కనబెట్టి, రాజకీయాలకు అతీతంగా మోడీ విజయం సాధించాలని మనసారా కోరుకుందాం. మనకోసం కాదు మన దేశ భవిష్యత్తు కోసం. భవిష్యత్ తరాల భద్రతకోసం.''
Bravo! Well said

Zilebi చెప్పారు...


మీ ఆశాభావం మరి యీ నాటి ప్రింట్ మీడియా గాని టీవీ మీడియా గాని వ్యక్త పరచటం లేదే మరి ?

రాటుదేలిన కృష్ణులెప్పుడు మారతారో మరి :)


జిలేబి

అజ్ఞాత చెప్పారు...

సుప్రిం కోర్టు పనికిమాలిన ఆదేశం ఇచ్చింది. జాతీయ గీతం విన్నవెంటనే ' బొడ్డును చూడయ్యో బొంగరమాడయ్యో' లాంటి బూతుగీతాలు వస్తే ఎలా ఉంటుంది.

శ్యామలీయం చెప్పారు...

. . . . . సుప్రీం కోర్టు పనికిమాలిన ఆదేశం ఇచ్చింది. . . . . .
తప్పు. అలా అనరాదు. అది కోర్టుపట్ల ధిక్కరణగా భావించవలసి వస్తుంది. తస్మాత్ జాగ్రత!

@భండారువారూ,

మీ దృష్టిలో అజ్ఞాతలైనా విజ్ఞులైనా ఎవరు ఏమి వ్యాఖ్యను పంపినా అది అవశ్యప్రచురణీయం అన్న అధ్బుతమైన వ్రతం ఉండవచ్చును.

మీరు స్వయంగా ఇంకా పత్రికారచయిత హోదాలో కొన్ని ప్రత్యేకమైన అభిప్రాయవ్యక్తీకరణస్వేఛ్చాస్వాతంత్ర్యాలు కలిగి ఉంటే ఉండవచ్చును.

కాని ఒక బ్లాగరుగా మీరు బ్లాగులో వ్రాసే వాటికి ఏవిధంగా పత్రికారచయితకు లభించే న్యాయపరమైన రక్షణా ఉండక పోవచ్చును.
బ్లాగులో వ్రాసే విషయానికే కాదు, బ్లాగు టపాలకు అనుబంధంగా ప్రచురించబడే వ్యాఖ్యలకూ బ్లాగరు వ్యక్తిగతంగా పూర్తిబాధ్యత వహించి తీరాలి చట్టప్రకారం. ఆ విషయంలో పత్రికారచయితలకు కూడా ఏ విధమైన చట్టరక్షణా లభించదని భావించవలసి ఉంది.

కాబట్టి మీ బ్లాగులో, 'ఈ వ్యాఖ్య' వంటి అనుచితమైన ఆక్షేపణీయమైన బాధ్యతారహితవ్యాఖ్యలను మీరు ప్రచురించరాదు. అలా ప్రచిరించిన పక్షంలో మీరు చట్టం చేతుల్లో చిక్కుల్లో పడే ప్రమాదం పొంచి ఉంటుంది.

మీ ఉ.బో.స ఎవడిక్కావాలీ అంటారా. అలాగే. మన్నించండి.

అజ్ఞాత చెప్పారు...

@ శ్యామలీయం

మీ ఓవర్ యాక్షన్ ఆపండి. సరదాగా రాసుకొనే బ్లాగులో రంధ్రాన్వేషణ చేస్తూ, అతివాగుడు వాగుతూంటారు. ఇంతక్రితం కూడా పవన్ కల్యాణ్ భార్య రేణు దేశాయ్ ఆమే భావలు చెప్పుకొంటే మీరు విడాకులిచ్చిన తరువాత అలా చెప్పటం కోర్ట్ ధిక్కారం అని వాగారు. ఏం ప్రజలు వాక్కోటానికి స్వాతంత్రం లేదా? జీవితంలో ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా? కోర్ట్ గుమ్మం ఎక్కారా? కోర్ట్ లు ఎలా పనిచేస్తాయో తెలుసా మీకు? నువ్వు పోలేదు గనుక ప్రజలను భయపెడుతున్నావు. కోర్ట్,పోలిస్తేషన్ కి వెళ్ళిన సామాయ ప్రజలకు తెలుసు. అక్కడ అడుగుపెట్టిన మొదలుకొని డబ్బులతో పని అని. అది లేకపోతే ఎవ్వరు పట్టించుకోరు.

సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పులు అమలు గాకుండా ఎన్నో ఉన్నాయి. ఇళ్ళు ఖాళి చేయించమన్ని సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఇస్తే, ఒక ఊరి యం.యల్.ఎ. ఇళ్లను పగలగొట్టాడాని కొచ్చిన జె.సి.బి. లకు అడ్డంగా పణుకొని, ఆ ఉతర్వుని బుట్టధాకలు చేశారు. సదరు యం.యల్.ఎ. ఆక్రమించిన స్థలం ఇంకా ఆయన చేతిలోనే ఉంది. ఇది జరిగి సంవత్సరాలౌతున్నా ఆయనపై ఏ చర్యలేదు. ఆ ఉతరువు ఎముదుకు అమలు చేయలేదని అడిగిన వారు,పట్టించుకొన్న కోర్ట్ వారు లేరు.

మీరేదో సుప్రీం కోర్ట్ తీర్పు అంట్టున్నారు కదా! దేశం లో హైకోర్ట్ ఇచ్చిన తీర్పులను వేలలో అమలు కాలేదు. సుప్రీం కోర్ట్ వ్యక్తిగతం గా వెళ్ళితే ఇచ్చిన తీర్పులు అమలు కాని వి ఎన్నో ఉంటాయి. ఒక కేసు సుప్రీం కోర్ట్ కెళ్ళాలంటే చాలా ఏళ్లు పడుతుంది. 30-40 ఏళ్లు కోర్ట్ చుట్టుతిరిగి, ముసిలి వాళ్లై చస్తారు, తిరగటానికి మనుషులు లేక ప్రజలు వదిలేస్తారు. ఈ విషయాలు కోర్ట్ లో జడ్జ్ లకు తెలుసు. వాళ్ళేమైనా వింటర్,సమ్మర్ శెలవులు తగ్గించుకొని తొందరగా తీర్పులిద్దామనుకొంట్టున్నారా?

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

@ శ్యామలీయం,

మీకూ సమాజం గురించి ఎమీ తెలియదు. కోర్ట్ తీర్పుల గురించి చెప్పి పెద్ద పోటుగాడిలా మాట్లాడుతారు.
PSకు పోయి ఫిర్య్యాదు చేయాలనుకో, వాళ్ళు నీకన్యాయం జరిగిందని ఫీలైపోయి, నీ కంప్లైంట్ ఊరికినే స్వీకరించరు. వందప్రశ్నలేసి నీ సంగతి మొత్తం తెలుసుకొని, కేసు లో నిజం ఉండటమే గాక, అమ్యామ్యం ఇవ్వగలవాడివైతేనే ఫిర్యాదు స్వీకరిస్తారు. అది కంప్లైంట్ మాత్రమే. F.I.R. రాయటం వేరే పెద్ద పని.
నీ కంప్లైంట్ వల్ల పని ఎక్కువ, వచ్చే ఫలితం తక్కువ (డబ్బులు)అనుకో, వాళ్ళే నీకు ఓ ఐదువేలు రూపాయలు ఇచ్చి మమ్మల్ని వదిలేయ్యి అని తిప్పి పంపుతారు. ఆ మధ్య, నోయిడా లో ఓ మహిళ molestation ఆరోపణ చేయటానికి పోలిస్ స్టేషన్కి పోతే, వాళ్ళు ఓ ఐదువేలు ఆమేకి కిచ్చి కంప్లైంట్ చేయొద్దని,వెనక్కి తీసుకోమని సర్ధి చెప్పి పంపారు.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.