1, ఏప్రిల్ 2015, బుధవారం

గొయ్యిని తవ్వుట మా వంతు


శాస్త్రవేత్త పేరు గుర్తు రావడం లేదు కాని మా కాలేజి ఇకనామిక్స్ లెక్చరర్ రామనరసింహం గారు ఆ  ఆర్ధిక నిపుణుడి  సూక్తిని తరచూ చెబుతుండేవారు. నిరుద్యోగం నిర్మూలించాలంటే ఒక గొయ్యిని తవ్వాలి. ఆ గొయ్యిని పూడ్చాలి. తవ్విన వాడికి ఓ ఉద్యోగం, పూడ్చిన వాడికి ఓ ఉద్యోగం.
రెండు నెలల క్రితం కాబోలు ఏ శాఖవారో తెలియదుకాని మా అపార్ట్ మెంట్ ముందు రెండు గోతులు తవ్వారు. అక్కడితో వారి పని అయిపోయినట్టు వుంది. వాటిని అలాగే ఒదిలేసి వెళ్ళారు.
ఈరోజు ఉదయం నన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన టీవీ ఛానల్ వాహనం ఆగోతుల్లో ఒక దానిలో పడిపోయింది. తీయడానికి తాతలు దిగివచ్చారు.
మొత్తం మీద పొద్దున్నే ఓ గండం గడిచింది. ఇంకా  ఎన్ని ఎదురు చూస్తున్నాయో తెలియదు. ఎవరికి పిర్యాదు చేయాలో కూడా తెలియదు. ఇలా గోతులు తవ్వి వాటిని అలా ఒదిలేసి వెళ్ళేవారు అక్కడ తమ సెల్ నెంబరు వివరాలు ఒదిలి వెడితే బాగుంటుంది అనిపించింది.

జంటనగరాల మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్  సోమేశ్ కుమార్ గారికి ఇది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ అవస్థలు పడేవారికి పెద్ద సమస్య.  





(Sai Sree Nilaya Apartments, Oppo. Maharaja Chaat, Madhapur, Hyd. - 500 081)
    

1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

6టీవీ డ్రైవర్ కొత్తగా బండి నడపడం నేర్చుకున్నాడా? కళ్ళెదుట గోతి కనిపించినా దాన్లోకే పోనిచ్చాడు! ఇతగాడికి లైసెన్స్ ఎలా వచ్చింది చెప్మా?