12, మే 2014, సోమవారం

కారాలే కారాలు

టీవీల్లో కారాలు మిరియాలు
ఇంట్లో కొత్తావకాయ కారాలుఈసారి సుస్తీ చేసి కోలుకుంటున్న మా ఆవిడకు సాయంగా మా వొదినె గారు విమలాదేవి, మేనకోడలు వనం విజయలక్ష్మి - ఓహ్! ఒక్క రోజు కష్టానికి ఏడాది పాటు హాయిగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. కానీ ఆడవారి కష్టానికి ఖరీదు కట్టే షరాబు ఏడీ! 

4 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

Why not most menfolk lend a helping hand in preparing these pickles is a mystery to me.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - ఇలాటి పనుల్లో మగవాళ్ళు కల్పించుకోకపోవడమే పెద్ద సాయం అన్న అభిప్రాయం చాలామంది ఆడంగులలొ వుంది అంటారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పి.జి.ఒడ్ హౌస్ తన ఒక నవలకి ముందుమాటలో (పుస్తకం పేరు Summer Lightning అనుకుంటాను; చదివి చాలా కాలమైంది) అంటాడు - నా భార్య సాయం చెయ్యకపోతే ఈ పుస్తకం వ్రాయడం ఇంకా ముందే ముగించుండేవాడిని - అని.

ఆడవాళ్ళ కష్టం అన్నది కరక్టే గాని, కొత్తావకాయ పెట్టడం విషయంలో మాత్రం మగవారి "సాయం" పైన చెప్పినటువంటి ఫలితాన్నే ఇచ్చే ప్రమాదం ఉంది. అందుకని కూసింత దూరంగా కూచుంటేనే క్షేమం (ఫొటో లో వెనకాల కూర్చున్నది మీరే అనుకుంటాను :)). :)

voleti చెప్పారు...

1. కాయలు కొనుటకు, వాటిని ముక్కలు కొట్టిన పిదప ఇంటికి చేరవేయుటకు, కావలసిన ముడిపదార్ధములు కొనుటకు ఈ డ్రైవర్ లేకుండా పని జరుగదుగా..
2.నడుము నొప్పిపుట్టే వరకు ముక్కలు తుడిచి ఇచ్చుట..ఇంతవరకే మన డ్యూటీ...

3. అరగంట బట్టి పైన డాబా మీద ఎండబెట్టిన వూట ముక్కలు తెమ్మని సైడ్ వింగు లోంచి చెప్తున్నా వినక ఇలా మీ పోస్ట్ కి కామెంట్స్ రాస్తున్న..ఓకే బై లేటయితే స్వరం పెరిగే ప్రమాదం వుంది...