14, మే 2014, బుధవారం

ప్రార్ధన చేసే పెదవులకన్నా సాయంచేసే చేతులు మిన్న - సత్య సాయిబాబాఎప్పుడయినా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని అనిపిస్తే అందుకు  తగిన మార్గం ఒకటుంది. అదేమిటంటే అవసరంలో వున్నవాళ్ళకి సాయం చేయడమే. చాలామంది సాయం అర్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటూ వుంటారు. వారిలో కొందరికి సాయం చేయడానికి ఆ దేవుడు మిమ్మల్ని  ఎంపిక చేసుకుని వుంటాడనుకోవాలి. మనకు ఏదయినా పదవి వచ్చినా, ఉద్యోగంలో  పెద్ద  హోదా దొరికినా,  సంపదలు లభించినా  అవసరంలో వున్న వారికి సాయపడడానికే అన్న ఎరుక పెంచుకోవాలి.