24, మే 2014, శనివారం

వాగ్దానభంగం


వాగ్దానాన్ని మించిన దానం లేదంటారు రాజకీయనాయకులు.
వాగ్దానాలు చేస్తూ పోవాలి కాని వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే రాజకీయాల్లో పుట్టగతులుండవని వారిలో కొందరి నిశ్చితాభిప్రాయం. గత రెండు మూడు రోజులుగా ఏ ఛానల్ పెట్టినా, లేదా ఏ ఛానల్లో చర్చకు వెళ్ళినా ఇదే చర్చ.వాగ్దానాలు  చేయడం అన్నది రామాయణ కాలం నుంచీ వుంది. దశరధ మహారాజు తన భార్య కైకేయికి, వరసకు మూడో భార్య అయినా మాటవరసకు కూడా మూడు వరాలు ఇవ్వకుండా కేవలం రెండే రెండు వరాలు ఇచ్చాడు. మాట ఇచ్చి తప్పడం ఇక్ష్వాకుల వంశంలో లేదంటారు కాని  ఇచ్చి మరచిపోవడం వుందన్న విషయానికి తార్కాణం  కైక మళ్ళీ గుర్తు చేసేదాకా ఆయనకు ఇచ్చిన మాట  గుర్తుకు రాకపోవడమే.  అంటే ఏమిటన్న మాట. ఎన్ని మాటలన్నా ఇవ్వవచ్చు. మాటలు పుచ్చుకున్నవాళ్ళు వాటిని గుర్తు పెట్టుకుని గుర్తు చేసేదాకా ఇచ్చిన వాళ్లకు ఆ మాటలు నిలబెట్టుకోవడంపై ఎలాటి పూచీ లేదని రామాయణమే చెబుతోంది. ఇలా ఏదో సరదాకు రాస్తే కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి సుమా!  నవ్వు వచ్చిందనిపిస్తే  నా మొహాన ఒకటి గిరవాటు వెయ్యండి. కోపం వస్తే మొహం అటు తిప్పుకోండి. స్వస్తి.

NOTE: Courtesy image owner

1 వ్యాఖ్య:

అజ్ఞాత చెప్పారు...

YSRCP AYETHE VETAKARAM GURTHUKURADHU