12, మే 2014, సోమవారం

విజేతలకు అభినందనలు.

గతం నిజం, వర్తమానం వాస్తవం. భవిష్యత్తు వూహ.
ఇలా జరిగింది నిజం. ఇలాజరుగుతోంది వాస్తవం. ఇలా జరుగుతుంది వూహ.
మునిసిపల్  ఎన్నికల్లో తెలుగుదేశం విజయం వాస్తవం. ఈ నిజాన్ని అంగీకరించి తీరాలి.
'ఇలా జరిగింది కాబట్టి ఇలానే జరుగుతుంది, ఇలా జరిగే వీలే లేదు' ఈ వాదనలన్నీ వూహాజనితాలు.
ఒక్కొక్కటిగా ప్రజాతీర్పు బయటకు వస్తుంది. వచ్చిన తీర్పును గౌరవించడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. మన ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా అన్నీ జరగాలని అనుకోవడం అత్యాశే అవుతుంది.
ఎన్నికల్లో విజేతలకు అభినందనలు.   

2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

"మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం వాస్తవం"

నిజమే కానీ ఇది పూర్తి వాస్తవం కాదు. తెలంగాణాలో తెదేపా ఘోర పరాజయం చెందిందనే వాస్తవాన్ని కూడా గుర్తించండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@jai Gottimukkala - అంశం కేవలం సీమాంధ్ర కు సంబంధించినది. తెలంగాణా విషయంలో మీ అభిప్రాయం సరైనదే.