7, జనవరి 2022, శుక్రవారం

వావిలేని వరుసలు - భండారు శ్రీనివాసరావు


(కాస్త గందరగోళంగా వుంటుంది, ఇది తెలుగు నేలపై జరిగే వ్యవహారం కాదు, ఇంగ్లీష్ జోకుకు తెలుగు అనువాదం చేశాను కాబట్టి ఇలా మిడికింది)

ఏకాంబరం పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే అప్పటికే పెళ్ళయి విడాకులు తీసుకున్న అమ్మాయిని ఎవరికీ చెప్పకుండా గుళ్ళో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెట్టాడు. ఆ కొత్త పెళ్లి కూతురు అమ్మాయి కాదు, అప్పటికే అమ్మ. ఆ అమ్మడికి ఈడొచ్చిన ఒక అమ్మాయి వుంది. పెళ్లి అయిన రోజే ఒకమ్మాయికి తండ్రి అయ్యే అదృష్టం పట్టిన ఏకాంబరానికి అతడి తండ్రి రూపంలో దురదృష్టం ఎదురయ్యింది. ఒకరోజు కొడుకును చూడ్డానికి ఏకాంబరం ఇంటికి వచ్చిన తండ్రి, సొంత కొడుక్కి సవతి కూతురు అయిన అమ్మాయిపై మనసు పారేసుకుని ఏకంగా పెళ్ళాడేసి కొత్త కాపురం పెట్టాడు. ఆ విధంగా కూతురు వరసయిన అమ్మాయి ఇప్పుడు సవతి తల్లి అవతారం ఎత్తింది. కన్న తండ్రికే పిల్లనిచ్చిన మామ అయ్యాడు. అలా ఏకాంబరం కట్టుకున్న పాత పెళ్ళాం తోనూ, అతడి తండ్రి కొత్త పెళ్ళాం తోనూ హాయిగా కాపురాలు చేసుకుంటున్న రోజుల్లో కధ మరో మలుపు తిరిగింది.
ఏకాంబరానికి సవతి కూతురు లేదా సవతి తల్లి వరుస అయిన అయిన పాత తండ్రి కొత్త భార్య నెల తప్పింది. చూస్తుండగానే నెలలు నిండడం, పండంటి పిల్లాడిని కనడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడా పిల్లవాడు మన ఏకంబరానికి ఒక రకంగా మనుమడు. ఎంచేతంటే సవతి కూతురు కన్న తల్లికి తాను మొగుడు కాబట్టి. మరో రకంగా ఆ పిల్లవాడు ఏకాంబరానికి తమ్ముడు వరస, ఎందుకంటె అతగాడు తండ్రికి పుట్టిన కొడుకు కాబట్టి.
దాంతో ఏకాంబరం భార్య పాత్ర అమ్ముమ్మకు మారింది. దీనికి కారణం ఆవిడ కూతురే ఏకాంబరం నాన్నగారి భార్య కాబట్టి. ఈ వరస ప్రకారం ఏకాంబరం తన భార్యకు మనుమడు అవుతాడు. ఈ తికమకల నడుమ ఏకాంబరం భార్య ఓ మంచి రోజు చూసుకుని ఒక పిల్లాడ్ని కని కూర్చుంది. అతడి కన్న కొడుకే అతడి నాన్నకు బావమరిది అయ్యాడు. అంతేకాదు ఏకాంబరానికి సవతి తల్లి వైపు వరస తీసుకుంటే అతడు అతడికే తాత అయ్యాడు.
ఇలా వుండగా ఏకాంబరం ఇంటికి జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు. ఆ సమయంలో మొత్తం కుటుంబం ఇంట్లోనే వున్నారు.
లెక్కల వాడు అందర్నీ లెక్కపెట్టి చూసుకున్నాడు. తరువాత ఏకాంబరాన్ని అడిగాడు. ఆ కుర్చీలో కూర్చున్న పెద్దాయన ఎవరని.
‘ఆయనా ! ఆయన మా నాన్న. కాదు కాదు మా అల్లుడు’
‘ఈ పెద్దావిడ?’
‘నా భార్య’
‘ఆ చిన్నావిడ?’
‘మా అమ్మాయి, కాదు కాదు మా అమ్మ’
‘ఈ పిల్లవాడు?’
‘నా మనుమడు కాదు కాదు కొడుకు’
‘యితడు అతడికేమవుతాడు?’
‘మనుమడు, కాదు కాదు బామ్మర్ది’
‘ఈవిడ?’
‘మా సవతి తల్లి కాదు కాదు కూతురు’
జనాభా లెక్కల వాడు, నీళ్ళు కూడా అడక్కుండా మూర్చపోయాడు.

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...


Apoorva Raagangal (transl. Rare Melodies; Tamil pronunciation: [ is Apoorva Raagangal is a 1975 Indian Tamil-language romantic drama film written and directed by K. Balachander. The film stars Kamal Haasan, Sundarrajan, Srividya and Jayasudha, while Nagesh and debutant Rajinikanth play supporting roles. It revolves around Prasanna (Haasan) who falls in love with the much older Bhairavi (Srividya) while Bhairavi's daughter Ranjani (Jayasudha) is drawn to Prasanna's father Mahendran (Sundarrajan).

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత గారికి ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు