5, జూన్ 2021, శనివారం

ఏమి బాధలే హలా! - భండారు శ్రీనివాసరావు

 పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్  ఏళ్ళ తరువాత కూడా నాకిప్పటికీ ఇది జ్ఞాపకం వుంది.

అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.

ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని. భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.

దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ.

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

So Kalidas spoke Telugu? Thank you for enlightening the blog world with that gem of knowledge. ;-)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“బాధ” అన్నది సంస్కృత పదమే అని “ఆంధ్రభారతి” నిఘంటువు ద్వారా తెలుస్తోంది.

Chiru Dreams చెప్పారు...

ఇవన్నీ పిట్టకథలు లేండి. వీటిల్లో చాలా వరకు.. ఆ హీరో మీద పిచ్చి అభిమానంతో మనం సృష్టించుకున్నవే.

నీహారిక చెప్పారు...

S/O సత్యమూర్తి సినిమాలో ఒక పులి కథ చెప్తూ తండ్రి మూడో సారి కూడా వెళ్ళవచ్చు కదరా ? మహా అయితే మోసపోతాడు, ఫూల్ అవుతాడు, ప్రాణం కంటే ఎక్కువే మీ కాదుగా అని అన్వయించి చెపుతాడు.పిట్టకథలు చదివి యథాతథం గా అనుసరించరు. ఎవరికి వారు వారి జీవితాలకు మెరుగుపరుచుకోవడానికి ఆ కథలను ఉపయోగించుకోవాలి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బాగా చెప్పారు 👌.