10, మార్చి 2017, శుక్రవారం

‘క్రియే’టివిటీ



“సర్లెండి, మీకు ఉదయం తిన్న కూరే గుర్తుండదు, ఇక మనుషుల్ని ఎక్కడ గుర్తు పడతారు’ అంటుంది మా ఆవిడ.
ఇంటిలిఫ్టులో ఒక పెద్ద మనిషి తారస పడ్డాడు. నన్ను చూసి పలకరింపుగా నవ్వాడు. నేనూ బదులుగా చిరునవ్వు నవ్వి ‘ఎవరింటికండీ’ అన్నాను. ఆయన గతుక్కుమన్నట్టు అనిపించింది. తరువాత చెప్పింది మా ఆవిడ, ఆయన మా పక్క అపార్టుమెంటు ఓనరని.
ఇళ్ళల్లో సంగతి ఏమో కాని, ఆఫీసుల్లో ప్రత్యేకించి టీం వర్కు అవసరం వున్న కార్యాలయాల్లో పనిచేసేవారికి ఒకరికొకరు తెలిసివుండడం అన్నది చాలా అవసరం.
బహుశా ఈ ‘సంస్కృతి’  పెంచాలనే ఉద్దేశ్యంతో కాబోలు ‘క్రియ’ సంస్థలో సిబ్బందికి ఒక పోటీ నిర్వహించారు. గాలి ఊదిన బెలూన్లపై పనిచేసే సిబ్బంది పేర్లు రాసివుంటాయి. ఒకొక్కరూ వెళ్లి ఒక బెలూన్ తీసుకుని దానిపై పేరు రాసి వున్న సొంతదారుకు వాటిని అందచేయాలి. ఇలా సరిగ్గా చేయగలిగితే పనిచేసే వారందరూ ఒకరికొకరు తెలిసినట్టు లెక్క. సిబ్బందిలో ‘బృంద సంస్కృతి’ పెంచడానికి ఇటువంటి ‘క్రియేటివిటీ’ కార్యక్రమాలు చాలా అవసరం అనిపించింది.

   

3 వ్యాఖ్యలు:

GARAM CHAI చెప్పారు...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఓ జోక్ గుర్తొచ్చింది. కారిడార్ లో కనిపించి తనని చూసి పలకరింపుగా నవ్విన వ్యక్తిని అడిగారట మీలాంటి పెద్దమనిషే - మిమ్మల్ని ఎక్కడో చూసానండి, ఫేస్ బుక్ లోనా అని అడిగితే నేను ఫేస్ బుక్ లో లేనండి అన్నాడట ఆ వ్యక్తి. మరి ట్విట్టర్ లోనా, లింక్ డిన్ లేనా, వాట్సప్ లోనా అని అడిగారట. అన్నిటికీ 'కాదు' అనే సమాధానమే వచ్చిందట. మరెక్కడా, మీరయితే తెలిసిన మొహం లాగానే ఉన్నారు అని తికమక పడుతుంటే "నేను మీ పక్కింటి వాడిని" అన్నాడట ఆ వ్యక్తి 😀😀.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - సంతోషం