28, ఆగస్టు 2016, ఆదివారం

శభాష్ రఘు

ఈ కింది చిత్రంలో మధ్యలో కూర్చున్నది ఎవరో అందరికీ తెలుసు. ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు పక్కన మెడలో గుర్తింపు కార్డు వేలాడవేసుకుని, గళ్ళ చొక్కా ధరించి ఒద్దికగా కూర్చున్నది మా మూడో అన్నయ్య భండారు వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు భండారు రాఘవరావు. అతడు ప్రభుత్వ రెవెన్యూ శాఖలో అతి చిన్న ఉద్యోగి వీ ఆర్ వో. అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. ఇటీవలే ముగిసిన కృష్ణా పుష్కరాలలో చక్కని సేవలు అందించినందుకు రాఘవరావు ఇతర సిబ్బందిని అభినందిస్తూ ముఖ్యమంత్రి వారితో కలిసి ఫోటో దిగారు. రేయింబవళ్ళు పడ్డ శ్రమను చంద్రబాబు చూపిన ఈ ఆత్మీయ ప్రదర్శన మరపున పడేసిందని మా అందరికీ పెట్టిన పోస్ట్ లో మా రఘు పేర్కొన్నాడు.


1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీ అన్నయ్యగారి కుమారుడు రాఘవరావుకి, తదితర సిబ్బందికి అభినందనలు. ప్రభుత్వ సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తే పుష్కరాల లాంటి ప్రత్యేక కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని నిరూపించారు. 👏