6, ఆగస్టు 2016, శనివారం

ప్రమాదో ధీమతామపి


ప్రతిభావంతులు కూడా పొరబాట్లు చేస్తారు, ధీమంతులకు కూడా ప్రమాదాలు తప్పవు అనే అర్ధంలో సంస్కృతంలో వాడే ప్రయోగం ఇది.

2001  లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  యంపీటీసీ, జెడ్ పీ టీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీల వాళ్ళు విసుగూ విరామంలేకుండా ప్రచార పర్వంలో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర లో ప్రచారానికి వెళ్ళారు. సాక్షాత్తు రాములవారే అశ్వమేధ యాగాశ్వ పరిరక్షణకు వెళ్లినట్టు ముఖ్యమంత్రి సయితం ఆ స్థానిక ఎన్నికల్లో అలుపు ఎరుగని రీతిలో అనేక సభల్లో ప్రసంగిస్తూ వెడుతున్న సమయంలో ఒకచోట ప్రసంగం ముగిస్తూ ‘తెలుగు దేశం పార్టీ అభ్యర్ధుల్ని చిత్తుగా ఓడించండి’ అని పిలుపు ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు విస్తుపోయారు. జరిగిన పొరబాటు వెంటనే గుర్తించిన చంద్రబాబు దాన్ని వెంటనే సవరించుకున్నారు. ఇప్పట్లా అప్పట్లో ప్రత్యక్ష ప్రసారాల హడావిడి లేకపోబట్టి  ఈ ఉదంతం వెలుగు చూడలేదు. అయినా స్థానిక పత్రిక ఒకటి ప్రచురించింది. ఇంతటి పొరబాటు మాట ఆయన  నోటంట జారిపడడానికి  కారణం ఆయనలో ఏమూలనో దాగున్న కాంగ్రెస్ నేపధ్యం కారణం కాదుకదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. 

2 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆఁ, జనాల ఊహాగానాలకేమిలెండి. ఆయనా మనిషేగా, వరసగా సభల్లో ప్రసంగిస్తూ "ఆవిధంగా ముందుకు పోతుండటం" వల్ల అలిసిపోయి (fatigue) మాట తడబడుంటుందే కానీ కాంగ్రెస్ నేపధ్యం మూలాన అయ్యుండదని నా అభిప్రాయం. 🙂

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు - నా అభిప్రాయమూ కాదు. ఆ జిల్లా పత్రిక రాసిన వ్యాఖ్యానం అది.