23, నవంబర్ 2013, శనివారం

ఎన్టీయార్ పెళ్లి శుభలేఖ

1942

అంటే డెబ్బయ్యేళ్లు దాటిపోయాయి. అప్పటి శుభలేఖ ఇది.
అంత పాతది సరే. అంతకంటే విలువైనది  కూడా! 
అదేమిటంటే -
ఆంధ్రుల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి   పెళ్లి పిలుపు ఇది.
అందుకే ఇది అరుదయినదీ, అంతే అపురూపమైనదీ.
నెట్ మిత్రుడు ఒకరు దీన్ని పంపారు.
అసలైనదేనా అనే సందేహాలు పక్కనపెడితే ఎంచక్కా సంతోషం కలిగించే పాత పెళ్లి పత్రిక ఇది. 
(ఎన్టీయార్  పెళ్లి పత్రిక)

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

ఈ శుభలేఖ అసలైనదే కావచ్చును. ఈ రోజుల్లో ఎంత లేనివాళ్ళైనా సరే శుభలేఖలు ఇంత సింపుల్‌గా వేయించుకోవటం లేదు. అందుచేత ఇలాంటి శుభలేఖలు ఎక్కడా కనిపించవు.
ఒకవేళ ఎవరైనా తమాషాకు గాని ఇలా డిజైన్ చేసి ఉండే అవకాశమూ ఉంది. కాదన లేము.

మొన్న మాకు వచ్చిన ఒక శుభలేఖ మూడువందల రూపాయల ఖరీదైన దట. సుభలేఖ ఒక్కింటికి వేలమీదే ఖర్చు చేసే వారూ ఉన్నారు. ఇంక వారు పెళ్ళిలో చేసే దుబారాలను ఊహించుకో వలసినదే మరి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం - ధన్యవాదాలు

పల్లా కొండల రావు చెప్పారు...

good collection sir.