18, నవంబర్ 2013, సోమవారం

ఎవరు గొప్ప


సజావుగా నడవడానికి రెండు పాదాలు అవసరం. ఒక కాలు ఎత్తి ముందుకు వేస్తున్నప్పుడు రెండో కాలు వెనుకే వుండిపోతుంది. దాన్ని చూసి ముందు కాలు నవ్వుకోవడం అంటే నగుబాటు కావడమే. ఎందుకంటే రెండో కాలు ఎత్తి అడుగు ముందుకు వేసినప్పుడు మొదటి అడుగు వేసిన పాదం వెనుకే వుండిపోతుంది. కాబట్టి నేనే ముందు, నాదే ముందడుగు అని భేషజాలకు పోవడం శుద్ధ దండుగ. మానవ జీవన యానంలో అందరూ కాస్తా ముందూ వెనుకా. ఆ మాత్రానికే మిడిసిపాటు యెందుకు ?


(Courtesy image owner)కామెంట్‌లు లేవు: