13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

చూడు చూడు తమాషా ఫోను తమాషా! సెల్ ఫోను తమాషా!అంతా కలిసే వుంటారు. కలిసే కాఫీలు తాగుతారు. కానీ ఏం లాభం ఎవరి మొబైల్ వారిదే. ఎవరి గోల వారిదే.


స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడపడానికి సముద్ర తీరానికి వెడతారు. అక్కడా ఎవరి ఫోను వారిదే. ఫోనులో ఎవరి ఫ్రెండ్స్ వారికే.  


అభిమాన ఆటగాళ్లను చూడడానికి పనికట్టుకుని స్టేడియాలకు టిక్కెట్లు కొనీ మరీ వెడతారు. తీరా చూస్తే ఏముంది. ఆట దోవ ఆటదే! ఫోన్లలో ఎవరి ముచ్చట్లు వారివే.


నలుగురూ కలవాలని, ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేయాలని  మనసు పడతారు. తీరా వెళ్ళిన తరువాత షరా మామూలే!


ప్రేమికులు ఒకచోట కలిస్తే మాటామంతికి కొదవేముంటుంది. నిజమే. కాకపోతే ఎవరి ‘మాట’ వారిదే. ఎవరి ‘మంతి’’ వారిదే.


ఎన్నాళ్ళబట్టో కలవాలనుకున్న చిన్ననాటి ఫ్రెండ్ కలుస్తాడు. ఎన్నో కబుర్లు చెప్పుకోవాలని మనసు పడతారు. కలుస్తారు. కబుర్లూ  చెప్పుకుంటారు. కాకపొతే ఎవరి ఫోనులో వాళ్ళే.


మనసుపడి మ్యూజియానికి వెళ్ళినా ఇదే తంతు.


చూడదగ్గ ప్రదేశాలకు వెళ్ళినా ఇదే తీరు.


మనకు బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చెప్పినట్టు  అసలీ  మొబైల్ ఫోను అన్న సంగతే తెలియని రోజుల్లో ఆల్ బర్ట్  ఐన్ స్టీన్ పశ్చిమ దేశాలవారికి   ఎప్పుడో చెప్పారు. మనసుల మధ్య సంబంధాలను సాంకేతిక పరిజ్ఞానం ఘోరంగా దెబ్బతీస్తుందని, మనిషి  తాను సృష్టించుకున్న సాంకేతిక పరికరాలకే  బానిసగా మారుతాడని.

ఈ ఫోటోలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదూ! 
NOTE: Courtesy respective photographers       

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


బాగుందండీ ! మంచి కలేక్షనే పట్టారు !!

పెళ్లి పీట ల పైన మొబైలు లో పెళ్లి కొడుకు, కూతురు, అయ్యవారు, వగైరా ఏక కాలం లో మాట్లాడే ఒక ఘట్టం చూడ్డం ఈ మధ్య చూడ్డం తటస్థించింది !!

ఇవ్వాళ హిందూ లో ఈ వార్త లలో పీపల్ జర్నలిజం కాలం లో ఈ వాక్యం కూడా కనబడింది !

"Buddha walks out to get food from an hand not holding a mobile and he returns with an empty bowl "!!

cheers
zilebi