వీరు ప్రకృతి వైద్యం రాజు గారు కాదు.
ఫ్లోరిడా స్టేట్ ఓర్లాండ్ లో గత రెండు పదిహేడు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఐ టీ నిపుణులు. మరో బాదరాయణ సంబంధం నాకు ఫేస్ బుక్ లో ఫాలోయర్. రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చి ఈ ఉదయం నన్ను కలిశారు.
తన పేరు మంతెన సత్యనారాయణ రాజు అని పరిచయం చేసుకున్నారు.
ఫేస్ బుక్ లో పేరు Satya Mantena.
సహృదయులు.
managudi.org అనే బ్లాగ్ నడుపుతున్నారు. తెలుగునాట వున్న అన్ని చిన్నా పెద్ద దేవాలయాలు, వాటి ఆస్తిపాస్తులు మొదలయిన సమస్త వివరాలను కష్టపడి సేకరించి ఒకే చోట పదిలపరుస్తున్నారు
వారి కృషి అభినందనీయం.
కింద ఫోటో రాజు గారితో నేను. నేను అని ప్రత్యేకంగా ఎందుకంటే ఈ మధ్య నన్ను ఫోటోల్లో చాలా మంది గుర్తుపట్టడం లేదు (ట)
6 కామెంట్‌లు:
యూట్యూబ్ థంబ్ నెయిల్ లాగా టైటిల్ పెట్టారన్నమాట. ఓకే.
మొదట ఫోటో చూసి మంతెన వారు ప్రకృతి వైద్యంతో మళ్లీ యంగ్ అయిపోయారే మనమూ ఫాలో అయిపోదామా ఆ వైద్యానికి అనుకున్నా "సుమం" డీ :)
🤣🤣
మంతెన గారి ప్రకృతి వైద్యం అవసరం లేదు భండారు గారికి. ఆయన వయసు పెరిగేకొద్దీ పసిమి ఛాయతో అందంగా హాండ్సమ్ గా అవుతున్నారు. 75+ సంవత్సరాలు ఉన్నట్టుగా అనిపించరు. నిండు నూరేళ్ళు ఆనందం గా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటాము.
జుట్టు - నిగ నిగలాడే నలుపు
మేని ఛాయ - పసిమి తెలుపు
మాటల్లో చేతల్లో ఒడుపు
విమర్శలలో పొదుపు
ఆప్తులకు ఆత్మీయ పిలుపు
వార్తలు ఇవ్వడం లో ఉండదు మరుపు
లౌక్యంతో సాధించు గెలుపు
వెరసి భండారు వారి మెరుపు
Anonymous మీ అభిమానానికి ధన్యవాదాలు. మొన్నటికి మొన్ననే ఆగస్టు ఏడో తేదీన 78 నిండి 79 లోకి అడుగుపెట్టాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి