20, ఆగస్టు 2024, మంగళవారం

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం


అమెరికాలో నవంబర్ లో  జరిగే ప్రెసిడెంట్ ఎన్నికల హోరు క్రమంగా ఊపందుకుంటోంది.
ఈరోజు చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ మొదలయింది. 
ప్రెసిడెంట్ పదవికి ఆ పార్టీ తరఫున పోటీ పడుతున్న కమ్లా హారిస్ (ప్రసంగించిన వక్తలలో చాలా మంది ఆమె పేరుని ఇలాగే ఉచ్చరించారు) తో పాటు, గత నాలుగేళ్లుగా అమెరికాను పాలించిన ప్రెసిడెంట్ జో బైడెన్ కూడా హాజరై ప్రసంగించారు. 
ఒకరకంగా ఇది ఆయనకు వీడ్కోలు కార్యక్రమం అనిపించింది. ఆయన మైకు పట్టుకోగానే హాలు లోని వేలాది మంది వుయ్ లవ్ బైడెన్ అనే ప్లే కార్డు పట్టుకుని లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు. 
ప్రస్తుత వైస్ ప్రెసిడెంటు కమ్లా హారిస్ కూడా హాజరయ్యారు. కాకపోతే ఆమె ప్రసంగం ఈ రాత్రి వుండక పోవచ్చు.
రెండు ప్రధాన పార్టీలు ఇలాగే సభలు సమావేశాలు నిర్వహిస్తాయి కానీ బహిరంగంగా కాదు. ఏదో ఒక నగరంలో, అదీ ఒక సమావేశ మందిరంలో.
దేశ ప్రెసిడెంటు పాల్గొంటున్న సభను  టీవీలో వీక్షిస్తున్న నా కంటికి ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనపడలేదు. సీక్రెట్ సర్వీసు వాళ్ళు వుంటే వుండవచ్చు. కానీ ఆ వ్యవహారం అంతా సీక్రెట్.
ఇలాంటి పద్ధతులు మన దేశంలో కూడా రావాలని ఆశించడం అత్యాశ కాదు కదా!

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "అత్యాశ కాదు కదా!" //

Of course అత్యాశే. Any doubt ? అదంతా show-off, status symbol గా భావించే నాయకులున్న మన దేశంలో ..... నిస్సదేహంగా అత్యాశే.

అజ్ఞాత చెప్పారు...

అదొక్కటి చాలాండి.






నారదా

అజ్ఞాత చెప్పారు...

డిమెన్షియా వల్ల బిడెన్ తాను ఎక్కడున్నది మరచిపోయి అయోమయంగా తిరగడం కొన్ని వీడియోలలో కనిపించింది. అందుకే అతన్ని తప్పించి కమలా హారిస్ ను అధ్యక్ష పదవి పోటీలో నిలిపారు అంటున్నారు. ఆమె పదినిముషాలు ఏమి చెబుతుందో తెలియకుండా మాట్లాడి బిగ్గరగా నవ్వుతుంది. అమెరికాలో బరిలో ఉన్న అభ్యర్థులను చూస్తే అశ్చర్యంగా ఉంది. ఎన్నికల పై డీప్ స్టేట్ ప్రభావం ఉంటుంది అని తెలుస్తుంది.