21, సెప్టెంబర్ 2021, మంగళవారం

సబ్ కో సన్మతి దే భగవాన్ – భండారు శ్రీనివాసరావు

 డ్యూ.(DEW). మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి.

అప్పటికి ఇంకా ప్రాధమిక విద్యాస్తాయిలోనే వుంది. తల్లి టీచరు. తండ్రి కళాకారుడు. మా పక్క పోర్షన్ లో వుండేవాళ్ళు. చిన్నప్పుడు మా ఇంట్లోనే పెరిగింది. వాళ్ళు విశ్వాసం రీత్యా క్రైస్తవులు. ముస్లిం మత సంస్థ నడుపుతున్న ఒక ప్రముఖ పాఠశాలలో ప్రవేశ పరీక్ష రాసి ఫస్టున పాసయింది. తలితండ్రుల ప్రోత్సాహంతో హిందూ ధార్మిక సంస్థ నిర్వహిస్తున్న సంగీత పాఠశాలలో చేరింది. ఆ పాప కృష్ణాష్టకం, శివాష్టకం చదివే తీరుకు ముగ్డులయిన ఆ పాఠశాల వాళ్ళు ఓ ఏడాది శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు డ్యూను ఎంపిక చేశారు. అందులో మంచి పేరు  తెచ్చుకుంది. తనకు వచ్చిన బహుమతిని మాకు చూపించి మురిసిపోయింది. మేము అంతకంటే ఎక్కువ మురిసిపోయాము. ఇలా పెరిగిన పిల్లలే భావి భారతానికి పట్టుకొమ్మలు.డ్యూ అంటే మంచు బిందువు. తుషారం.

కామెంట్‌లు లేవు: