8, సెప్టెంబర్ 2021, బుధవారం

సీడ్ గణేష్ మంచి ఆలోచన – భండారు శ్రీనివాసరావు

 

ఎవరికి వారే ఇంట్లోనే గణేష్ ప్రతిమల నిమజ్జనం చేసే ఆలోచన తెలంగాణా ప్రభుత్వం చేసింది.
ఇదిగో కింది బొమ్మల్లో కనబడే ఈ ప్రతిమను పూర్తిగా మట్టితో తయారు చేశారు. గణేష్ పూజ పూర్తయిన తర్వాత విసర్జన సమయంలో ఈ ప్రతిమపై నీళ్ళు చల్లాలి. ఆ నీటిలో ప్రతిమ పూర్తిగా కరిగిపోతుంది. ఏడో రోజున అందులో ఉంచిన విత్తనం నుంచి మొక్క మొలకెత్తుతుంది. పదిహేనో రోజుకి మొక్క పూర్తిగా పెరుగుతుంది అని ఈ ప్రతిమను ఉంచిన చక్కటి ప్యాకింగ్ పై రాసి వుంది.
హైదరాబాదు ప్రెస్ క్లబ్ ద్వారా ఇది నాకు అందింది. వారికి ధన్యవాదాలు.(08-09-2021)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

క్లబ్బులున్న వాళ్లకి అందుతాయి. సామాన్య మానవులకెవరిస్తారండీ ?