10, ఏప్రిల్ 2021, శనివారం

గతం గుర్తులు –భండారు శ్రీనివాసరావు

 కొన్నేళ్ళ  క్రితం పత్రికల్లో చిన్న వార్త వచ్చింది. హైదరాబాదు నగరంలో అతివేగంగా  నిర్మిస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రజలకు అవగాహన కలిగించే ఫోటో ప్రదర్శన గురించిన వార్త అది. నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాన్ని ప్రారంభించడంలో ఉద్దేశ్యం నిర్వాహకులకే తెలియాలి. మెట్రో రైళ్ళను సాధారణంగా దిగువ, మధ్య తరగతి వాళ్ళతో పాటు సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం వుంటుంది. ఫైవ్ స్టార్ సంస్కృతికి అలవాటుపడిన వారు ఏదో ఒకసారి సరదాకు మెట్రో ఎక్కుతారేమోకాని ‘కార్లు’ దిగిరారు. అలాటి పెద్ద హోటళ్ళలో ఇలాటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందో అన్నది నిర్వాహకులకే తెలియాలి. కానీ, మెట్రో నిర్మిస్తున్నది అల్లాటప్పా సంస్థ కాదు. అలాటి వాళ్లని ఫైవ్ స్టార్ హోటళ్ళు వొదిలిరమ్మనడం అత్యాశే అవుతుందేమో!

మెట్రో రైలు మార్గం నిర్మాణం కోసం నగరంలో అనేకచోట్ల పాత నిర్మాణాలను తొలగించేందుకు చర్యలను వేగవంతం చేస్తున్నారన్నది మరో వార్త. అభివృద్ధి వల్ల వాటిల్లే తప్పనిసరి సమస్యల్లో ఇదొకటి. పాత కట్టడాలను తొలగించడం తప్పనిసరి అయినప్పుడు వాటిని ఫోటోలు తీయించి భావితరాలకోసం భద్రపరచడం నిర్మాణ సంస్థల బాధ్యత. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా అనేక నగరాల రూపురేఖలు అనూహ్యంగా అతివేగంగా మారిపోతున్నాయి. వెనుక నగరం ఇలా వుండేది అని చెప్పుకోవడానికి ఏమీ మిగిలేట్టు లేదు. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఇప్పుడు దేశంలో వున్నారో, వాళ్ల పిల్లల వద్ద అమెరికాలో వున్నారో తెలియదు. ఆయన ఎవ్వరో కాదు విజయవాడ నగరం పూర్వ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్. ఆయన బెజవాడ నగరానికి చెందిన అనేక పాత భవనాలను (రాజగోపాలచారి రోడ్డులోని లాయర్ చక్రవర్తి గారి ‘శ్వేత భవనం’ వాటిల్లో ఒకటి) ఫోటోలు తీయించి పెట్టారని విజయవాడ ఆకాశవాణిలో చాలాకాలం వార్తావిభాగం న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన శ్రీ ఆర్.వీ.వీ. కృష్ణారావు చెప్పారు. మెట్రో నిర్మాణ సంస్థ తలచుకోవాలే కాని ఇదేమంత పెద్ద విషయం కాదు. నన్నడిగితే పాత నిర్మాణాలను కూలగొట్టి కొత్తవి నిర్మించేందుకు అనుమతులు కోరేవారు విధిగా పాత కట్టడం ఫోటో జత చేయాలని అధికారులు నిబంధన విధిస్తే బాగుంటుందేమో!

19 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

చాలా మంచి సూచన ఇది!

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

Chiru Dreams చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

"నేను ఈటపాకు మొదట వ్యాఖ్యను ఉంచాను. ఏమని? "చాలా మంచి సూచన ఇది!" ఇందులో ఏమి రాజకీయాలున్నాయీ, ఏమి పార్టీలను నేను సమర్ధించటమో విమర్శించటమో అన్న గొప్పదో ఘోరమైనదో ఒక పని చేసానూ?"

ఆర్యా,

నేను మాత్రం ఏమన్నాను భండారువారూ! ఎప్పట్లాగే గత మీ వ్యాఖ్యల దృష్ట్యా మీకు కరకట్ట గుర్తు వస్తుంది అని అనుకున్నాను అన్నాను. దాన్లో తప్పేముందీ? రాజకీయం ఏముందీ? మీరే రాసిన మీ గత వ్యాఖ్యలు స్మరించుకోవడం కూడా తప్పైతే ఎలాగండీ శ్యామలీయం దొరవారూ?

Chiru Dreams చెప్పారు...

భండారు గారు! ఇంతకు ముందు ఒక పోష్టులో మీరు ఉండవల్లి గారి ప్రసంగం గురించి చెప్పేటప్పుడు... అందులో మీడియావాల్లు "ఎవర్కి కావలసిన ముక్కలు వారు రాసుకున్నారు" అన్నారు. సరిగ్గా మాదాసు గంగాధరం గారి రాజీనామా గురించి ఇదే జరిగింది.

https://www.andhrajyothy.com/telugunews/madasu-gangadaram-resigned-janasena-1921041108054919

https://www.sakshi.com/telugu-news/politics/madasu-gangadharam-resigned-janasena-party-1356274