13, ఏప్రిల్ 2021, మంగళవారం

సారీ చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే


సారీ చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటే – భండారు శ్రీనివాసరావు  

ఏదైనా  అంశం పట్ల నాకున్న అభిప్రాయం నేను చెప్పిన తర్వాత దానిపై జరిగే వాదోపవాదాలతో నేను నిమిత్తం పెట్టుకోను. నా అభిప్రాయం తప్పని సహేతుకంగా ఎవరైనా చెబితే సరిదిద్దుకోవడానికీ, ఆ విషయం బహిరంగంగా అంగీకరించడానికి కూడా నేనెప్పుడు వెనుకాడింది లేదు.

నిన్న సుమన్ టీవీ వాళ్ళు రఘురామ కృష్ణం రాజు గారి ఎపిసోడ్ పై నా వివరణ ఇవ్వమని అడిగారు. ఇక ఆ విషయంలో చెప్పేది ఏమీ లేదని, నేను పొరపాటు మాట మాట్లాడి వుంటే తప్పకుండా వివరణ ఇచ్చేవాడిని కానీ  ఇది ఆ సందర్భం కాదని బదులిచ్చాను.

చివరికి సుమన్ టీవీ వాళ్ళే రాజుగారి నుంచి వివరణ తీసుకుని ఈ గందరగోళానికి శుభం కార్డు వేసినట్టున్నారు. ఈ విషయం SIVARAMAPRASAD KAPPAGANTU గారి  పోస్టు చూసేదాకా నాకు కూడా తెలియదు. వారికి కృతజ్ఞతలు.

(13-04-2021)


2 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@నీహారిక: ధన్యవాదాలు. మీము మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు