29, జనవరి 2019, మంగళవారం

Sr NTR Unknown Facts Explained by Sr Journalist Bhandaru Srinivasa Rao |...





కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారితో ఒక విలేకరిగా నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని విచిత్రమైన విశేషాలు

2 కామెంట్‌లు:

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ఎన్టీఆర్ గురించి నా జ్ఞాపకాల వీడియో చూసిన తర్వాత మిత్రులు శ్రీ మాగంటి కోటేశ్వరరావు అమెరికా నుంచి ఫోన్ చేసి తన అనుభవం ఒకటి చెప్పుకొచ్చారు.
దానవీర శూర కర్ణ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి ఆయన కూడా వచ్చారు. సితార సినీ పత్రికలో పనిచేసిన మాగంటి అప్పుడే వెండి తెరపత్రికకి మారారు.
ఆ సినిమాకి ఎన్టీఆర్ దర్శకులు కూడా. మూడు ప్రధాన భూమికలు పోషిస్తూ మరో పక్క దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడం ఒక రకంగా కత్తి మీద సాము.
ఒకసారి సెట్లో ప్రవేశించిన వెంటనే షూట్ కి రెడీ చెప్పబోతూ పైన ఏడో నెంబరు లైటు సంగతి ఓసారి చూడండి అని సెట్ బాయ్ కి చెప్పారుట ఎన్టీఆర్. అది విని కెమెరామాన్ కన్నప్ప గారు ఆశ్చర్యపోయారట. అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా వుంటే రామారావు గారు ఇదేమిటి ఇలా అంటున్నారని వెళ్లి చూస్తే నిజంగానే ఏడో నెంబరు లైటు వెలగడం లేదట.
రామారావుగారు సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు అంటే ఇంతటి కఠోర శ్రమ చేయబట్టే, ఇంతటి సునిశిత పరిశీలనా శక్తి ఉండబట్టే అంటారు మాగంటి వారు.

Jai Gottimukkala చెప్పారు...

ఎన్టీఆర్ అర్ధరాత్రి వేళ చీర కట్టుకొని శివపూజలు చేయడానికి తానే సాక్షినని కీర్తి శేషులు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు చెప్పారు. మీ వీడియోలో ఉటంకించిన "తణిఖీ" అంతా నాటకమని, మీలాంటి విలేఖరులను గండిపేటకు తీసుకెళ్లే ముందట జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఆయన చెప్పారు.