20, జనవరి 2019, ఆదివారం

‘ఈ సినిమా ఆడదు. రెండోవారం ఎత్తేస్తారు’


‘ఈ సినిమా ఆడదు. రెండోవారం ఎత్తేస్తారు’
ఈ మాట అన్నది సూపర్ స్టార్  కృష్ణ.
అప్పట్లో అంటే సుమారు ముప్పయి అయిదేళ్ళ క్రితం, విజయవాడలో తన చిత్రం (పేరు గుర్తురావడం లేదు) రిలీజ్ కోసం వచ్చి మనోరమా హోటల్లో బస చేశారు. ఆ రోజుల్లో అదే నెంబర్ వన్ హోటల్. జ్యోతి విలేకరిగా వెళ్లి కలుసుకున్నాం. వున్నది కాసేపే అయినా ఆ కొద్ది సేపట్లో ఆయన లెక్క పెట్టలేనన్ని సిగరెట్లు తాగడం చూసి నేను విస్తుపోయాను.
ఆడే సినిమా కాదు అని కృష్ణ  కామెంటు చేసింది  తను హీరోగా నటించిన   చిత్రం మీదనే. అదే విచిత్రం.
ప్రకాశం బాబాయ్ గుర్తుకు వచ్చాడు.
మా చిన్నప్పుడు మా వూళ్ళో  కొత్త వడ్లు రాశులుగా కళ్ళాల్లో ఉన్నప్పుడే చూసి  ‘ఇది ఇన్ని పుట్ల ధాన్యం’ అని ఉజ్జాయింపుగా చెప్పేవాడు. కొలిచి చూస్తే ఆయన మాటే నిజం అయ్యేది.
అలాగే ఏ సినిమా ఆడుతుందో, ఏ సినిమా డబ్బాలు వెనక్కి పోతాయో స్వపర బేధం లేకుండా చెప్పడంలో నటుడు కృష్ణ అందెవేసిన చేయి అని సినిమా వర్గాల్లో చెప్పుకునే వారు.

కామెంట్‌లు లేవు: