13, జనవరి 2016, బుధవారం

ఇంగ్లీష్ జోకులు ఇలాగే వుంటాయి


(నాదేంలేదు, అనువాదం చేయడం  తప్ప)
పనిమనిషి ఇంటి యజమానురాలిని అడిగింది జీతం పెంచమని. పెంచడానికి మూడు కారణాలు చెప్పమంది ఇంటావిడ.
“నేను మీకంటే బాగా బట్టలు ఇస్త్రీ చేస్తాను”
“అలానా! ఎవరు చెప్పారు నీతో అలా?”
“ఎవరో కాదు మన సారే ఆ మాట నాతో చాలా సార్లు చెప్పారు”
“అల్లానా! సరే! ఇంకో కారణం చెప్పు”
“నేను మీకంటే బాగా వంట చేస్తాను”
“అలానా తల్లీ ఇదెవరు చెప్పారు?”
“ఇంకెవరు? మన అయ్యగారే!”
“ఓహో! అలా కూడా చెప్పారా అయ్యగారు, అది సరే నీ జీతం ఎందుకు పెంచాలో మరో కారణం చెప్పు”
“అది చెప్పడం బాగుండదండీ! కానీ మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు, పడక గదిలో మీకంటే నేనే బాగుంటానుట”
“ఏమిటీ! ఇది కూడా అయ్యగారే చెప్పారా? ఇంటికి రానీ సంగతి తేలుస్తాను.”
“అయ్యో అలా అనుకున్నారా! ఈ సంగతి చెప్పింది అయ్యగారు కాదండీ  మీ కారు డ్రైవరు”
“సరే! ఇంతకీ యెంత పెంచమంటావు ముందది చెప్పు”(కార్టూనిష్ట్ ‘చక్రవర్తి’ గారికి కృతజ్ఞతలతో )

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఒక వయసు వచ్చాక మనిషికి హుందాతనం రావాలండి - నవ్వడానికైనా ఏడవడానికైనా. ఇది జోకు అని ఎవరన్నారో మీకు నవ్వెలా వచ్చిందో?

అజ్ఞాత చెప్పారు...

Superr..bagundi.. last one is punch

Unknown చెప్పారు...

స్వాతి లాంటి సెక్స్ పత్రికల్లో ఉండే జోకులు మీరు బ్లాగులో వ్రాస్తున్నారు.

Zilebi చెప్పారు..."స్వాతి" లాంటి సెక్స్ పత్రిక :)

పాపం వేమూరి బలరామ్ :)

జిలేబి

మనోసాక్షి చెప్పారు...

ఎదుగిన కొద్దీ ఒదిగి ఉండండి గురూ గారూ

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

ఒక అజ్ఞాత తెలుగులో బాగాలేదంటే మరో అజ్ఞాత ఇంగ్లీష్ లో సూపర్ అన్నారు. ఒక మనోసాక్షి ఒదిగి వుండమని సలహా ఇస్తే ఒక మార్క్సిస్టు ఏదో పత్రికలో రావాల్సిన జోకంటూ అక్షింతలు వేసారు. పాపం అ ఎడిటర్ అంటూ ఒక జిలేబీ వ్యాఖ్యానించారు. కానీ ఎవ్వరూ ఈ జోకుకు పెట్టిన శీర్షిక 'ఇంగ్లీష్ జోకులు ఇలాగే వుంటాయి' (నిజానికి ఇలాగే ఏడుస్తాయి అని రాయబోయి బాగుండదు అని మానేసాను) అనేదాన్ని పట్టించుకోలేదు. అనువాదం వరకే నా బాధ్యత అన్న నా విన్నపాన్ని కూడా విన్నట్టు లేదు. అయినా అందరికీ ధన్యవాదాలు.(చదివినందుకు), కాసే చెట్టుకే రాళ్ళు, రాసే కలానికే పోట్లు.