11, జనవరి 2016, సోమవారం

విభిన్న అనుభవంమొన్న సాయంత్రం అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణ వినే యోగం కలిగింది.  జ్వాలా, ఆయన భార్య విజయలక్ష్మి, వనం రంగారావు భార్య గీత, మా ఆవిడ, ఆవిడతో నేనూ హైదరాబాదు సమీపంలోని  శ్రీ చిన జియ్యర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వుంది. చక్కటి రహదారి సౌకర్యం. మేము వెళ్ళే సరికే స్వామి వారి మంగళా శాసనం మొదలయింది. విశాలమైన ప్రార్ధనా మందిరం. ఆడా మగా అనేకమంది భక్తులు నిశ్శబ్దంగా ఆయన ప్రసంగాన్ని ఆలకిస్తున్నారు. మధ్యమధ్య సంస్కృత శ్లోకాలు వున్నప్పటికీ స్వామి అనుగ్రహభాషణ యావత్తూ తేట తేట తెలుగులో, తేలికయిన పదాలతో సాగిపోయింది. సుమారు రెండుగంటలకు పైగా ఆయన ప్రసంగించారు. తరువాత  వచ్చిన వారందరూ ఆశ్రమం వారు సమకూర్చిన ప్రమిదెల్లో దీపాలు వెలిగించారు. ఆ సన్నివేశం కనుల విందుగా వుంది. దీప ప్రజ్వలన చేస్తున్న వారిలో మా వాళ్ళు కూడా వున్నారు. ఓ ఆర్ ఆర్  మీదుగా తిరిగి వచ్చేసరికి పదిగంటలు దాటింది.  


కామెంట్‌లు లేవు: