11, జనవరి 2016, సోమవారం

కొత్త మనాదిపేర్లు అనవసరం అందుకే ప్రస్తావించడం లేదు. ఈ మధ్య ఓ మిత్రుడు తన అనుభవం పంచుకున్నారు. అమెరికా నుంచి, అక్కడే సెటిల్ అయిపోయిన, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసారు. హైదరాబాదులో వాళ్లకు వున్న పిత్రార్జితం తాలూకు ఇంటిని అమ్మేస్తున్నారట. అందులో  ఒక గది నిండా వాళ్ళ నాన్నగారు సేకరించి పెట్టుకున్న వేలాది పుస్తకాలు వున్నాయట. ఎవరయినా తెలిసినవాళ్ళు అడిగితే ఇవ్వమని  కోరారట. తీరా వెళ్లి చూస్తే వాటిల్లో చాలావరకు అపూర్వమైన గ్రంధాలుట.  ఈయన మనసుపడి వాటిని తన ఇంటికి తెచ్చుకున్నారట. అందుకోసం ఒక గదిని ఖాళీ చేసి మిగిలిన దాంట్లో సర్డుకున్నారట. మంచి పుస్తకాలు అయాచితంగా వచ్చిన మాట నిజమే కానీ, పుస్తకాల మీద తనకున్న ప్రేమ పిల్లలకు వుండకపోతే ఎల్లా అన్నది ఇప్పుడాయన్ని పట్టుకున్న కొత్త మనాది.NOTE: Courtesy Image Owner

కామెంట్‌లు లేవు: