నాలుగు వాక్యాల కధ – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాలుగు వాక్యాల కధ – భండారు శ్రీనివాసరావు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మే 2020, మంగళవారం

నాలుగు వాక్యాల కధ – భండారు శ్రీనివాసరావు

“కూరలో ఉప్పు సరిపోయిందా నాయనా” ఆవిడ అడుగుతోంది.
దేశం కాని దేశంలో ఆ మహాతల్లి తన పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకి కన్నతల్లి గుర్తుకువచ్చి  చలపతి కంట్లో ఉప్పటి కన్నీరు ఉబికి వచ్చి తింటున్న కంచంలో పడింది.
“సరిపోయింది”
తన కంటితడి ఆమె కంటపడకుండా పై పంచతో తుడుచుకుంటూ జవాబు చెప్పాడు చలపతి.