Baba
Fakruddin రాసిన ఒక రివ్యూ చదివాను.
“ఈ
సినిమా చూస్తూ ఏడుపు వస్తే, (ఆపుకోకండి, హాయిగా)
ఏడవండి. (మనసులోని భారం దింపుకోండి)
“(ఈ
సినిమాలోని భావోద్వేగాల కన్నీళ్ళలో ఒంట్లో వున్న సగం రోగాలు కొట్టుకుపోతాయి.
(కధను) మనసారా ఫీల్ అవ్వండి. ఏడవండి!”
ఇలా సాగుతుంది, ఆ సినిమా
రివ్యూ.
మా చిన్నప్పటి కన్నాంబ, నాగయ్యలు
నటించిన సినిమా బాపతు కాదు కదా అని ఓ క్షణం అనిపించింది. ఆ రోజుల్లో మహిళా
ప్రేక్షకుల చేత ఎన్ని కన్నీళ్లు కార్పిస్తే ఆ సినిమా అంత హిట్టు అని
చెప్పుకునేవారు.
నాకు పెద్ద సినిమాలు అన్నా, పెద్ద
పెద్ద హీరోలు నటించిన గొప్ప సినిమాలు అన్నా అంతగా ఆసక్తి వుండదు. పిల్లలు ముచ్చట
పడితే ఆ ముచ్చట తీర్చడానికి సినిమాకు వెళ్ళడం తప్పిస్తే, ఎప్పుడు
అయిపోతుందా
అని ఎదురు చూస్తూ ఆ మూడు గంటలు గడిపేయడమే నా పని.
అలానే ఒక సినిమా చూశాను. అప్పటికే ఆ రివ్యూ ఫేస్
బుక్ లో చదివి వున్నాను. ఇదొక ఏడుపుగొట్టు సినిమా అనే నమ్మకంతోనే వెళ్లాను.
సడన్ గా ఇంటర్వెల్ వస్తుందేమో, లైట్ల వెలుగులో
కంటి నీరు తుడుచుకుంటున్న సంగతి ఇతరులకు తెలుస్తుందేమో అని సిగ్గుపడుతూ వుంటే, హాల్లో
చాలామంది పరిస్థితి అదే!
ఒక్కటే ఊరట.
ఈ సినిమాను తన బ్యానర్ లో సమర్పించిన పెద్దమనిషి
కుటుంబంలోనే అనేక మంది హీరోలు వున్నారు. వారితో తీయాలని అనుకోకపోవడమే ఈ సినిమా
అదృష్టం. చూసేవారి అదృష్టం కూడా.
లేకపోతే, వారి హీరోయిజాన్ని ఆకాశానికి ఎలివేట్
చేసే మూసకొట్టుడు డైలాగులతోను, చావకొట్టుడు ఫైటింగులతోనూ మూడువంతుల
సినిమా నిండి పోయి,
షరా మామూలు తెలుగు సినిమాల్లో ఒకటిగా మిగిలిపోయి, రెండో
వారం తిరక్కముంది తిరుగుముఖం పట్టి వుండేది.
భార్య కోరికను తీర్చే భర్తలు చాలా మంది. భార్య కన్న కలను నిజం చేసే భర్త ఈ సినిమాలో కనిపిస్తాడు. సింపుల్ గా ఈ ఒక్క లైను కథను హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు.
నేనెప్పుడు పేరు వినలేదు
కానీ ఈ సినిమా దర్శకుడు కొత్తవాడయినా బహు గట్టివాడిలా వున్నాడు. తానే కధ
రాసుకున్నాడు. కధను నమ్ముకుని సినిమా తీశాడు. పాత్రలకు
తగ్గ పాత్రధారులను ఎంపిక చేసుకున్నాడు. అదెంత చిన్నది అయినా, వీటి
కోసమే పుట్టారా అన్నట్టు వాళ్ళు ఆ పాత్రల్లో అతి
సహజంగా ఒదిగిపోయారు. నటించలేదు. అదొక అదృష్టం ఈ సినిమాకి.
థియేటర్స్ లోనే నాలుగు రోజులు ఆడుతుందో, లేక
సగటు తెలుగు సినీ ప్రేక్షకుల అభీష్టం మేరకు పురిటి సంధి కొట్టి పోతుందో తెలియదు
కానీ, ఆ
ఫలితం, తెలుగు
సినిమా నొసటి రాతను నిర్ణయించడం ఖాయం.
'మనవాళ్ళు
కూడా చూడచక్కని సినిమాలు తీయగలరు' అని గర్వంగా చెప్పుకునే ఛాన్స్ మిస్
చేసుకుంటే, హీరోల
కోసం రాసుకునే డైలాగులు, వారికోసం మార్చుకునే కధనాలు మాత్రమే వున్న
సినిమాలే గతి.
సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం: చదివిన రివ్యూ
కూడా సినిమా అంత గొప్పగా వుంది.
Note :
Photo Courtesy owner of the photo.

2 కామెంట్‌లు:
Interesting, I will try to watch in a theater.
Anonymous garu Thanks
కామెంట్‌ను పోస్ట్ చేయండి