13, ఆగస్టు 2024, మంగళవారం

ఆగస్టు అంటేనే జ్ఞాపకాలు



అందించడం అంటే మాటలు కాదు.
రెండూ రెండున్నర గంటల కార్యక్రమమే అయినా ఇల్లాలు మాత్రం  శతావధానం చేయాల్సిందే.
‘ఆవు నెయ్యి, నల్ల నువ్వులు చెప్పాను, తెచ్చి ఇక్కడ పెట్టండి. భోక్తలు భోజనాలు చేసే చోట తడిగుడ్డతో తుడవండి, ఓ నిమ్మకాయంత అన్నం తెచ్చి విస్తట్లో ఆ మూల వుంచండి, చిల్లర డబ్బులు అక్కడ పెట్టండి, ఆధరువులు అన్నీ వరసగా తెచ్చి వడ్డించండి. జాగ్రత్తగా కనుక్కుని మారు వడ్డన చేయండి’ 
కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన బ్రహ్మగారు ఇలా విరామం లేకుండా ఏదో ఒకటి   అడుగుతూనే వుంటారు. తడిపొడి మడిచీర కట్టుకున్న ఇంటి ఇల్లాలు మరో ముచ్చట లేకుండా వాటిని చప్పున తెచ్చి అందిస్తుండాలి. పేరుకు ఆరోజున ఓ వంటమ్మగారు వచ్చి వంటలు చేసినా, ఈ అందింపు, వడ్డింపుల  బాధ్యత మాత్రం ఇల్లాలిదే. తద్దినానికి కర్తగా కూర్చొన్న భర్త మాత్రం  సవ్యం, అపసవ్యం అంటూ పురోహితుల వారు చెప్పినప్పుడల్లా భుజం మీది  జంధ్యాన్ని మారుస్తూ ఉంటాడు. 
మా అమ్మానాన్నల ఆబ్డీకాల సమయంలో కొన్ని దశాబ్దాలుగా మా ఇళ్ళల్లో జరుగుతూ వచ్చిన తంతు ఇదే.
 డ్రెస్సులకు అలవాటు పడిన యువతరం  కోడలు అయినా అలవాటులేని  చీరకట్టుతో  పడిన ఇబ్బందినీ,  కష్టాన్ని కళ్ళారా చూసినప్పుడు కానీ,  ఇన్నేళ్ళుగా మా ఆవిడ ఇంతగా  కష్టపడిందా అనే ఎరుక నాకు కలగకపోవడం ఆశ్చర్యం. 
నిజానికి ఇందులో  విడ్డూరం ఏముంది! ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్లు  తెలుసుకోగలిగితేనే ఆశ్చర్యపడాలి.    
   
 
నిరుడు అయినా ఈ ఏడాది అయినా, వచ్చే యేడు అయినా  మరచిపోవాలని అనుకుని మరచిపోలేని  ఈ జ్ఞాపకాలు బతికి వున్నంత కాలం వెంటాడుతూనే వుంటాయి.

5 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆరోజు ఆ వంట మొత్తం కూడా మా అమ్మగారే చేసేవారు. అవును, ఆడవాళ్ళ శ్రమని గుర్తించడం ఆషామాషీ కాదు.

అజ్ఞాత చెప్పారు...

మహిళల శ్రమను పురుషులు గుర్తిస్తారు మెచ్చుకుంటారు కూడా. అయితే మగవారి కష్టం, త్యాగం మహిళలు గుర్తిస్తున్నారా? సందేహమే 🤔

Zilebi చెప్పారు...

మగవారి కష్టాలేవిటీ ? ఆఫీసు కెళ్లి దర్జాగా కూర్చొని రావడమా ?


అజ్ఞాత చెప్పారు...

స్త్రీ అయినా పురుషుడైనా బాధ్యత తీసుకొనే వారికి పనిలో కష్టం కంటే ఇష్టం ఉంటుంది.

బిలేజీగా కామెడీ చేసే వారికి అర్థంకాదు ఆ విషయం.

మగవారి కష్టాలు మగవారు గుర్తిస్తేనే ఆశ్చర్యపడాలి.

Zilebi చెప్పారు...

బాధ్యత తీసుకొనే వారికి పనిలో కష్టం కంటే ఇష్టం వుంటుంది ..



సో మగవారు బాధ్యత తీసుకోకుండా అష్టకష్టాలు పడుతున్నారు అంటారా అనానిమస్సు గారు ?

బాగా చెప్పారు