2, అక్టోబర్ 2018, మంగళవారం

మహాత్ముని మననంలో......భండారు శ్రీనివాసరావు


1969
సుమారుగా  యాభయ్ ఏళ్ళ కిందటి మాట. అప్పుడు నేను  ఎస్సారార్ కాలేజీలో చదువుతున్నాను. 
మహాత్మాగాంధీ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని  గాంధీపై  పరిశోధన చేయడానికి జర్మనీలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం హైడెల్ బర్గ్ యూనివర్సిటీ నుంచి శర్మ మార్ల అనే ఒక ప్రొఫెసర్ వచ్చారు. వారిది కాకినాడ. చిన్నప్పుడే చదువులకోసం జర్మనీ వెళ్లి, అక్కడే   జర్మన్ అమ్మాయిని పెళ్ళాడి అక్కడే  స్థిర పడ్డారు.
గాంధీ గారి గురించి నగరాల్లో, పట్టణాల్లో, మారుమూల పల్లెల్లో జనం  ఏమనుకుంటున్నారు అనే విషయం తెలుసుకోవడానికి శర్మగారు వారి యూనివర్సిటీ పనుపున ఈ పరిశోధనకు పూనుకున్నారు. ఈ యజ్ఞంలో నన్ను ఆయన తన సహాయకుడిగా తీసుకున్నారు. సెలవుల్లో ఆయన వెంట తిరగడం, ఆయన ఏ వూరు వెడితే ఆ వూరికి తోడుగా వెళ్ళడం, ఆ వూరిలో నా వంటి విద్యార్ధులను మరి కొంతమందిని వెంట బెట్టుకుని ఆయన తయారు చేసిన ప్రశ్నావళి ప్రకారం ప్రజాభిప్రాయాన్ని నమోదు చేయడం ఇలా అన్నమాట.
ఈ క్రమంలో నాకు గాంధిగారి గురించి నాకు తెలియని విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది.
కొన్ని ఊళ్లలో గాంధి గారి ఫోటోను ఇళ్ళల్లో పూజామందిరాలలో పెట్టుకుని పూజిస్తున్న వైనం నన్ను ఆశ్చర్య పరచింది. శాంతి మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తిగా గాంధి గురించి తెలిసిన నాకు ఆయన కొందరి దృష్టిలో భగవత్ స్వరూపంగా మారడం ఒకింత వింత గానే అనిపించింది. ఒక దారీ తెన్నూ లేని మూలగట్టు పల్లెటూళ్ళలో కూడా గాంధీ అనే పేరు విన్నట్టు చెప్పారు కానీ కొందరికి ఆయన ఎవ్వరన్నది తెలవదు.
‘దేశానికి (వాళ్ళ దృష్టిలో వాళ్ళ ప్రాంతానికి) ఏదో చేసాడట కదయ్యా, మనకిక మంచి రోజులు వస్తాయని మా నాయనమ్మ చెప్పింది నిజమేనా’ అని మమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా వున్నారు.
‘ఆయన్ని కాల్చి చంపిన కబురు చెవిన పడిన తర్వాత మా వూళ్ళో ఎవరింట్లో పొయ్యి వెలిగించలేదు’ అని ఒక వూళ్ళో బాగా వయసుమళ్ళిన ఒక వ్యక్తి చెప్పారు.( ఆయన ఉద్దేశ్యం  ఆ మర్నాడు జనవరి ముప్పయి ఒకటిన అని. గాంధీ చనిపోయింది ముప్పయ్యో తేదీనే అయినా వారికి ఆ కబురు చేరేసరికి ఒక రోజు గడిచి పోయిందిట)
నేను పుట్టిన మూడేళ్ళలోపునే మహాత్మా గాంధి గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. శర్మ గారి ధర్మమా అని గాంధి గురించి ఒక అవగాహనకు వచ్చే అవకాశం నాకు విద్యార్ధి దశలోనే లభించింది.

9 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

నేను పుట్టిన మూడేళ్ళలోపునే మహాత్మా గాంధి గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు-చా నిజమా. ఎందుకలాగ.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అజ్ఞాత : ఏమో చిన్న వయసు కదా! తెలియదు మరి.

అజ్ఞాత చెప్పారు...

ఈరోజు కేసీఆర్ మాట్లాడిన భాష ఎంత దరిద్రంగా ఉంది.జ్వాలా గారు మీరు ఇలాంటివి ఎందుకు ఖండించరు. ఇదేమి జర్నలిజం సార్. ఒక్కసారి జ్వాలా గారు ఆత్మపరిశీలన చేసుకోండి.

నీహారిక చెప్పారు...

జర్నలిష్టులు రాజకీయ నాయకులకు సలహా ఇవ్వగలరా ?
మొన్న కొంగర్ కలాన్ లో కేసీఆర్ ప్రసంగం చప్పగా ఉందని వ్రాసారు.నిన్న కేసీఆర్ గారు బాగా పంచ్ లు వేసారు అని వ్రాసారు. ఆయన భాష మార్చుకోవడం అనేది జరగనిపని...వీలైతే మనమే ఆయన పంధాలో బూతులు తిట్టాలి.

హరిబాబు గారో, చిరంజీవి(బ్లాగ్)గారో తిడితే కొంచెం మనశ్శాంతి అయినా దక్కుతుంది.

ఇక్కడ వ్రాసే బూతులన్నీ నేర్చేసుకుంటున్నా..
నాకు గానీ అవకాశం దొరకాలీ "Jab We Met" సినిమాలో కరీనా కపూర్ లా ఆపకుండా తిట్టాలనేది నా తీరని కోరిక !

శ్యామలీయం చెప్పారు...

ఒక్కసారి జ్వాలా గారూ ఆత్మపరిశీలన చేసుకోండి అని భండారువారి బ్లాగులో అభ్యర్ధిస్తారేమిటీ? మీరు ఆ అభ్యర్ధన యేదో జ్వాలావారి బ్లాగులో ఉంచటం బాగుంతుంది. ఇకపోతే, జ్వాలాగారి ఉద్యోగమే కేసీఆర్ గారికి జనంలో ప్రచారం కల్పించటం అనుకుంటాను. అవసరం అనుకుంటే కేసీఆర్ గారి భాషయొక్క సౌందర్యసుగుణాలను గురించి జ్వాలాగారు ఒక గొప్ప వ్యాసం వ్రాయవలసి రావచ్చును.

అజ్ఞాత చెప్పారు...

సరే గానే శ్రీ శ్యామలీయం గారు మీరు కూడా ఒక సారి ఆత్మా పరిశీలన చేసుకోండి, ఎందుకంటె మీరా మాటన్నారు గనుక. నిజ్జంగా మీకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మీకు పరామ పవిత్రులుగా కనబడుతారా, మీరాధించే శ్రీరామచంద్రుడికి మల్లె.శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రావణాసురుడికి మల్లె. మీరు దేవుడు సామి. మీది చాలా పరిశుద్ధ ఆత్మ. నిజం పలకాలంటే మీ తర్వాతే ఎవరైనా. శ్రీ కెసిఆర్ గారి భాష మీకు కచరా గానూ, శ్రీ చంద్రబాబు గారి భాష పరమ సుందరంగానూ, ఛందోబద్ధంగానూ అనిపించడంలో తేడా ఏముంది.రామ రామ. మీరు దేవుడు సామే. పోనీ దేవా దూత సామే.

అజ్ఞాత చెప్పారు...

బండారు జ్వాలా గారు బంధువు కదా. జ్వాలా బ్లాగులో అసలు ఎప్పుడు సమాధానం ఇవ్వడు. ఇంత దారుణంగా కచరా మాటలను తెలంగాణా మేధావులు కూడా తప్పనరే.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఎవరండీ ఆ తెలంగాణా మేధావులు? జ్వాల గారు కిమ్మనరులెండి - కెసియార్ ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి కదా, అందువలన.

సూర్య చెప్పారు...

జ్వాలాగారి ఉద్యోగం ఆత్మలను పరిశీలించడం కాదేమో. ముందు వృత్తి పరిశీలన మీరు చేసి ఆ తరవాత ఆయనకి సలహా ఇవ్వండి.