20, అక్టోబర్ 2015, మంగళవారం

ఇదిగిదిగో అమరావతి ....(ఆహ్వానం)


రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు... వీరి వ్యవహార శైలే విభిన్నం.
మా ఇద్దరు అబ్బాయిల పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇద్దరికీ పెళ్లి పత్రికలు ఇచ్చివచ్చాను. పెద్దవాడి పెళ్ళి నాటికి  బాబుగారు ముఖ్యమంత్రి.  వై.ఎస్.ఆర్. ప్రతిపక్ష నాయకుడు. అలాగే చిత్రంగా రెండోవాడి వివాహం నాటికి వీరి పాత్రలు తారుమారయ్యాయి. అయినా వచ్చి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళారు. అందుకే ఈ ఇద్దరు నాయకులంటే నాకే కాదు జర్నలిష్టు సోదరుల్లో చాలామందికి అభిమానం.  నేను దూరదర్సన్ నుంచి రిటైర్ అయిన తరువాత కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలకు పిలుపులు అందుతూనే వచ్చాయి. ఇదిగో ఇప్పుడు అమరావతి పిలుపు.మధ్య్యాన్నం మామూలుగా నా బ్లాగు లోకంలో నేనుంటే, పుల్లారావు యాదవ్ అనే ఆయన ఫోను చేసారు. టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు మీ ఇంటికి వచ్చి అమరావతి ఆహ్వానం ఇస్తారు, ప్రస్తుతం జర్నలిష్టు కాలనీలో వున్నాం, ఇక్కడనుంచి ఎలా రావాలో చెబుతారా అని అడిగారు. అక్కడికి దగ్గరలో ఆంద్రజ్యోతి దగ్గర మా అన్నగారు రామచంద్రరావు గారు వుంటారు, అక్కడ ఇవ్వండి, శ్రమపడి ఇంత దూరం  రానక్కర లేదు అన్నాను. కానీ ఆయన, చంద్రబాబునాయుడు నాయుడు గారు మిమ్మల్ని పర్సనల్ గా కలిసి ఇవ్వాలని చెప్పారని చెప్పబోతుంటే నేనే వారించాను, పర్వాలేదు అక్కడ ఇవ్వండి, నాకు చేరుతుంది అని. మొత్తం మీద వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్ళారని మా అన్నయ్య ఫోనుచేసి చెప్పారు.  ఫోటో తీసి వాట్స్ ఆప్ లో పోస్ట్ చేసారు.(ఆహ్వానం పంపించడంలో ఇంత శ్రద్ధ తీసుకున్న  చంద్రబాబు గారికి ధన్యవాదాలు.)   

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Good. మరి బయలుదేరుతున్నారా? తప్పకుండా వెళ్ళివచ్చి శంకుస్ధాపన విశేషాలతో ఓ పోస్ట్ వ్రాస్తే మేం చదివి ఆనందిస్తాం. Happy journey.