24, సెప్టెంబర్ 2014, బుధవారం

చుక్కల్ని దాటుకు వెళ్ళిన భారత రోదసీ ప్రతిభ


"గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం ఆరుద్ర రచించిన గీతం మళ్ళీ స్పురణకు వస్తోంది.
'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే రీతిలో సాగిపోయే పాట ఇది.



సరిగ్గా ఇదే చేసిచూపారు భారత రోదసీ సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు. ఇంతవరకు ఏ దేశానికీ సాధ్యం కాని పనిచేసి చూపెట్టారు. పది నెలలుగా రోదసిలో ప్రయాణిస్తున్న  భారతీయ ఉపగ్రహాన్ని, కోట్ల కిలోమీటర్ల దూరంలో  అంగారకుడి కక్ష్యలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టి, సంక్లిష్ట రోదసీ పరిశోధనల్లో మనదేశం  ఎవరికీ తీసికట్టు కాదని సగర్వంగా నిరూపించారు.

భారతీయులందరూ  మనః పూర్వకంగా సగౌరవంగా ఇస్రో శాస్త్రవేత్తలకు 'సాల్యూట్' చేయాల్సిన  శుభ సందర్భం ఇది.

NOTE: COURTESY IMAGE OWNER 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Just curious.

Do you know what is the ultimate purpose of this rocket? What for it was used and why money was spent on it, despite people in India having no basic utilities like water, roads and electricity?
I am not insinuating that this is bad attempt but what is India achieving with these things?

అజ్ఞాత చెప్పారు...

పై అజ్ఞాత గారికి , ఈ అజ్ఞాత రాయునది ..
ఇస్రో కుడా లాభాపేక్ష తోనే పనిచేస్తుంది .
ఇతర దేశాల ఉపగ్రహాలని ప్రయోగించటం ద్వారా తన పరిశోధనకి కావలసిన బడ్జెట్ ని నింపుకుంటుంది . ఇది ఒక మార్కెటింగ్ లా కూడా ఉపయోగపడుతుంది .
దేశానికి కూడా కాస్తో కూస్తో పేరు .

మనం బాధపడాల్సిన విషయాలు దీని కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి , వాళ్ళు కేటాయించిన బడ్జెట్ అతి స్వల్పం , మన రాజకీయ నాయకుల అవినీతి లో అది ఒక శాతం ఉంటుందేమో .