30, సెప్టెంబర్ 2014, మంగళవారం

విభజన పూర్తికాలేదా!


ఈ ఏడాది జూన్ రెండో తేదీన మునుపటి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది చారిత్రిక సత్యం.

నిన్నటికి నిన్న ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో జరిగిన మిక్సడ్ డబుల్స్ లో భారత జోడీ సానియా మీర్జా, సాకేత్ మైనేని కలిసి మన దేశం ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని చేర్చారు. సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్. సాకేత్ విశాఖ కుర్రవాడు. వీరిద్దరూ కలిసి సాధించిన విజయం పట్ల యావత్ దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన నాయకులు మాత్రం వారిని ఆంద్ర, తెలంగాణాలకు చెందినవారిగా గుర్తించి విడివిడిగా అభినందనలు తెలియచేస్తున్నారు. నగదు బహుమతులు, వేరే పురస్కారాలు అంటే అర్ధం చేసుకోవచ్చు, ఆంద్ర తెలంగాణా తేడా లేకుండా వారిద్దరూ కలిసి శ్రమించి సాధించిన విజయాన్ని 'ప్రశంసించడం'లో అడ్డొచ్చిన అడ్డుగోడలు ఏమిటో అర్ధం కాదు. నిజంగా అయాం సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్! 

      

10 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

విభజన పూర్తికావటమే కాదు. దాని పర్యవసానాలను మనం చూడటం మొదలైనది కూడా. ఈ రోజు కేవలం సానియాకు మాత్రమే శ్రీకేసీఆర్‍గారు అభినందనలు చెప్పటం గమనార్హమైన విషయం అన్నది మీరు సరిగ్గానే ప్రస్తావించారు. మా తెలంగాణా పిల్లలకే మేము సహాయం అందిస్తాము అన్నప్పుడు, పిల్లలనూ రాజకీయంగా విడదీయటం వంటివి కొందరి దృష్టిలో సమంజసం కాలేదు. వారు అది అసమంజసం అనటం కనీసం కొందరు తెలంగాణా వాదుల దృష్టిలో సమంజసం కాలేదు. ఇప్పుడు కేవలం సానియాకు మాత్రమే ప్రసంశలు అందించటం కూడా ఇటువంటి సంకుచితత్వమే అని మీరు అనుకోవచ్చును. సీమాంధ్రపిల్లవాడికి అభినందనలు సీమాంధ్రముఖ్యమంత్రి చెప్పుకోవాలె మా కెక్కడి సంబంధం అని తెలంగాణావాదులు కొందరు సమర్థించవచ్చును. అసలు సీమాంధ్రపిల్లవాడితో ఎందుకు సానియా జతగా ఆడాలె అని విసుక్కునే వారూ ఉండవచ్చును. ఇదంతా కాలప్రభావం. విడిపోయినది కేవలం భూభాగమే కాదు మనసులు అని నిరూపణ అవుతోందని అనిపిస్తోంది. ఇన్నాళ్ళూ కేవలం తెలుగుభాష పరిస్థితి బాగా లేదని బాధపడే వాళ్ళము ఇప్పుడు తెలుగుజాతి పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోందని బాధపడవలసి వస్తోంది. ఇంకా ముందు ముందు ఎలాంటివి చూడాలో. ఈ మాత్రానికేనా!

Unknown చెప్పారు...

vibhajanaku daariteesina paristitulu vaati manchi cheddalanu ippudu talachukodam kannaa,vibhajanaantaram koodaa enduku telangaana andhra anna vibhedaalostunnaayante raajakeeyam gaa kcr ki andhra boochi avasaram inkaa chaala undadam,chandra baabu ki telangaana lo raajakeeya aasalu chaavaka podam mukhyamaina kaarnaalu.
avi rendu rendu raashtraalaki unna aneka samasyalato paatu mana madhya dooraanni penchataaniki baagaa upayogapadi manasunna manushulni baadhistunnaayi

Jai Gottimukkala చెప్పారు...

సానియా మిర్జా పార్టనర్ మహారాష్ట్ర క్రీడాకారుడు అయి ఉంటె ఈ టపా వచ్చేదా?

ఎవరి రాష్ట్రం వారిని ఆ రాష్ట్రం నాయకులు అభినందించడంలో మీ బాదేమిటో? తెలంగాణా ఏర్పడ్డాక కూడా ఆంధ్రా వారికి ఈ "ప్రత్యెక హోదా" ఎందుకు ఇవ్వాలి?

సానియా మిర్జా (సాకేత్ మైనాని) ఎవరితో ఆడుతారో వారి ఇష్టం. అంతమాత్రాన ఆ రెండో వ్యక్తికీ కెసిఆర్ (కంభంపాటి హరిబాబు) సత్కరించాలని నిలదీయడం సహేతుకం కాదు.

అసలు శీర్షికలోనే తిరకాసు ఉంది. ఆంద్ర ప్రదేశ్ అనబడిన ఒక మాజీ రాష్ట్రం విభజన జరిగిందనే బాద పడే బదులు ప్రజల కోరిక మేరకు తెలంగాణా ఆవిర్భవించిందని ఒప్పుకోలేరా?

శ్యామలీయం చెప్పారు...

జైగారు,
పొరబడుతున్నారేమో, యోచించుకోవలసిందిగా విజ్ఞప్తి.

సోనియా ఎవరితో ఆడుతారన్నది ఆమె యిష్టం అన్నదాంట్లో విప్రతిపత్తి యేమీ‌లేదు.

ఒక క్రీడాకారులజంట విజయం సాధించినప్పూడు ఆ యిద్దరినీ‌ కూదా అభినందించటం సముచితంగా ఉంటుంది. కాదు అందులో మావారెవరో చూసి వారిని మాత్రమే అభినందిస్తాం అంతె అది అంత హుందాగా ఉండదని నా అభిప్రాయం.

ముఖ్యంగా గెలిచిన వారిద్దరూ భారతీయులే కదా. ఇద్దరినీ కూడస అబినందించటంలో యే విధమైన వివక్షనూ చూప నవసరం కనిపించటం లేదు.

ప్రత్యేక రాష్ట్రాలూ, ప్రత్యేక జిల్లాలూ ఏవన్నా కానీయండి అవి కేవలం పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే సంబంధించిన వ్యవహారాలుగా భావించి ముందుకు సాగటం మంచిదని నా మనవి. జాతీయదృక్పధం కద్నా ప్రాంతీయాభిమానాలకు పెద్దపీట వేసే ఆలోచనలూ ప్రవర్తనలూ జాతి సమైక్యతకు విరోధంగానే పనిచేస్తాయి. ప్రస్తుతానికి ఎవరికి ఏ ముప్పూ తోచకపోవచ్చును. ఈ‌ విధమైన ధోరణులు చివరకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులనైనా కలిగించే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.

ముఖ్యంగా ఒక్క విషయం. రాష్ట్రస్థాయిలో రాణించిన క్రీడాకారుణ్ణి మా జిల్లా వాడు అని అభిమానించటాన్ని అర్థం చేసుకోవచ్చును. అలాగే జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారుణ్ణి మా రాష్ట్రంవాడు అని అభిమానించటాన్ని అర్థం చేసుకోవచ్చును. మరి అంతర్జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారులను మా దేశం వారు అని అభిమానించుకోవాలా వద్దా? అక్కడా మా రాష్ట్రమా కాదా అని వివక్ష చూపటం సబబా అన్నది కొంచెం ఆలోచించితే సులభంగానే అర్థమయ్యే మాట.

ఇందులో నా వ్యక్తిగతమైన ప్రాంతీయాభిమానం ఏమీలేదు. ఒలింపిక్ పతకం ఏ రాష్టం వారు గెలిచినా దేశం అంతా అనందిస్తునారు కదా. అంతర్జాతీయ క్రికెట్‌లో‌ రైనా సెంచరీ చేసినా రాయుడు సెంచరీ చేసినా దేశీయులంతా సమానంగానే ఆనందిస్తారు కదా? అటువంటి స్ఫూర్తికి విఘాతంగా ఎవరూ వర్తించటం సబబుకాదేమో అని నా భావన అంతే.

మీ‌ వ్యాఖ్యలో మొదటి ప్రశ్న. సానియా మిర్జా పార్టనర్ మహారాష్ట్ర క్రీడాకారుడు అయి ఉంటే ఈ టపా వచ్చేదా? అని. తప్పకుండా వచ్చేది. అసలు ఇటువంటి టపాను వ్రాయాలని నేనే అనుకొని భందారువారు వ్రాసారు కాబట్టి వ్రాయలేదు. నేనైనా, సీనియర్ పాత్రికేయులు ఆయనైనా ఇలాంటి జాతీయతాస్ఫూర్తికి విరుద్దమైన ఇటువంటి పనికి ఆ రెండవక్రీడాకారుడు ఏ రాష్ట్రం వాడైనా స్పందించే వారమే.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

@@ "సానియా మిర్జా పార్టనర్ మహారాష్త్ర క్రీడాకారుడు అయి ఉంటె ఈ టపా వచ్చేదా? "

పోనీ సానియా మిర్జా పార్ట్నర్ మహారాష్ట్ర ఆటగాడు అయ్యుంటే అతనిని కూడా అభినందించుండేవారా?

జట్టు విజయానికి జట్టు సభ్యులనందరినీ అభినందించడం సమంజసం, క్రీడాస్ఫూర్తి, ఎప్పటినుంచో వస్తున్నసంప్రదాయం.
వ్యక్తిగత అభినందనలు, ఊరేగింపులు, నజరానాలు ఆ జట్టులోని తమ రాష్ట్రం వాళ్ళకి తర్వాత లోకల్ గా చేసుకునే సన్మానాలు.

Unknown చెప్పారు...

ఆసియా క్రీడల్లో 46 పథకాలు వచ్చాయి. కాని ఆ నలభయ్యారు మందిని పేరు పేరునా అభినందించడం అన్నది ఎప్పుడూ లేదు. గతంలో సమైక్య రాష్త్రంలో కూడా అప్పటి నాయకులు రాష్త్ర క్రీడాకారులను వ్యక్తిగతంగా అభినందించారే దేశంలోని మిగతా ప్రాంతాల వారిని అభినందించిన సందర్భాలు చాలా తక్కువ. ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రం వారు అభినందిచుకున్నా, సన్మానించుకున్నా తప్పేమీ కనపడ్డం లేదు.

శ్యామలీయం చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

శ్రీకాంత్ చారిగారూ, పతకాలు సంపాదించిన క్రీడాకారుడిని/క్రీడాకారిణిని వారి స్వంతరాష్ట్రంవారు అభినందించటం తప్పని ఎవరూ అనరు. అది వ్యక్తిగత విజయాలకు సంబంధించినత వరకే సబబైన పని. ఒక జట్టుగా విజయం సాధించి దేశానికి గౌరవం తెచ్చినప్పుడు జట్టులోని అందర్నీ అభినందించటం సబబుగా ఉంటుంది. జట్టులో ఉన్నది హెచ్చుమంది ఐతే పేర్లు ప్రస్తావించటం కుదరక పోవచ్చును లెండి. కాని ఇద్దరే ఉన్న జట్టులో‌ రెండవవారిని, మారాష్ట్రం వారు కాదు కాబట్టి అన్నట్లు విసర్జించి వర్తించటం నిశ్చయంగా అక్షేపణీయమే. కుంటి సాకులవలన హ్రస్వదృష్టితో చేసిన పొరపాటుపని అన్నది ఒప్పు కాపోదు.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

విషయాన్ని ఆంద్ర-తెలంగాణా పరిధి దాటి చూద్దాం.

ఎంతో మంది భారత క్రీడాకారులు ఎన్నో పోటీలలో ఎన్నో పతకాలు & విజయాలు సాదించారు, ఇకముందు కూడా సాదిస్తారు. అందరినీ అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పేరుపేరునా (మూకుమ్మడిగా కాక) అభినందించడం జరగదు. ఈ ఆనవాయితీలో తప్పేమీ లేదు.

ఆటలలో వ్యక్తిగత సామూహిక తేడాలు ఉండడం సహజమే. 2/4/11 ఇలా బృందాలు ఏర్పడతాయి. ఇది ఆ పోటీ యొక్క విశిష్టత. దీని వల్ల మాట్లాడుతున్న సిద్దాంతానికి సంబధం లేదు. ఉ. రిలే పరుగులలో 4 కలిసి పతకం సాదిస్తే మన రాష్ట్రానికి చెందినా ఒకే ఒక్కరిని సత్కరిస్తాం కానీ అందరినీ కాదు.

మీరు చెప్పిన అంచెల పద్దతి (జిల్లా-రాష్ట్రం-దేశం) వినడానికి బాగానే ఉంది. అయితే (మన అదృష్టం బాగుండి & ప్రయత్నాలు ఫలించి) సమీప భవిషత్తులో భారత్ డజన్ల కొద్దీ ఒలంపిక్ పతకాలు గెలిస్తే, ఆ అభినందించే 29 నాయకులకు కంటశొశ వస్తుందేమో?

రైనా ధోనీ ఎవరయినా సెంచరీ కొడితే వీక్షకులు చప్పట్లు కొట్టడం వేరే, నాయకులు అభినందించడం వేరే. అలా చేయడం మొదలు పెడితే క్రికెట్ సీసన్ మొదలయ్యాక అభినందనలు/సత్కారాలు తప్ప 29 ముఖ్య మంత్రులకు ఇంకేమీ పని ఉండదు.

(నాకు తెలిసి రాయుడు ఎప్పుడూ సెంచరీ కొట్టలేదు. ఇతను టెస్టు మాచులు సరికదా ఒకరోజు పోటీలు కూడా ఆడలేదు. రైనతో ఇతన్ని పోల్చడం క్రికెట్ అభిమానుడిగా నాకు నచ్చలేదు)

రాష్ట్రాలను కేవలం పరిపాలనా సౌలభ్య వ్యవహారంగా చూడాలన్న మీ సలహా అందరూ పాటించి ఉంటె తెలంగాణా ఎప్పుడో ఏర్పడేది. గత పన్నెండేళ్ళ ఏడుపులు వెక్కిరింతలు పెడబొబ్బలు చీత్కారాలు మాకు తప్పేవి. It is unrealistic to expect Telangana to create a new precedent when the previous state followed the exact opposite.

Jai Gottimukkala చెప్పారు...

@శ్రీకాంత్ చారి:

ఉమ్మడి (సమైక్య?) రాష్ట్రంలో రాష్ట్ర క్రీడాకారులను అందరినీ అభినందించారా? అవ్వ చెప్పుకుంటే సిగ్గు చేటు.

రాజూ యాదవ్ ప్రపంచ కుస్తీ పోటీ గెలిచినప్పుడు ఒక్కడంటే ఒక్కడు మెచ్చుకుంటే ఒట్టు. తానూ స్వయంగా క్రీడాకారుడిని (కనీసం దిలీప్ ట్రాఫీ ఆడకపోయినా) రోజుకు రెండు సార్లు పెడబొబ్బలు పెట్టె కిరణ్ రెడ్డి రాజుకు దమ్మిడీ ఇవ్వలేదు, అతన్ని ఒక్క మెప్పుకోలు మాటా అనలేదు.

ఇప్పుడు బుకాయించే వారికి ఇవి తెల్వవు!