(ఇంకో 'మాత్రమే' ఏమిటంటే 'ఇది' కేవలం అనువాదం మాత్రమే!)
భార్య: ఏవిటి ఆఫీసు నుంచి పెందలాడే దిగడ్డారు?
భర్త: మా బాసుకి నా మీద కోపం వచ్చింది. గో టు హెల్ అన్నాడు. అంతే!
ఇంటికొచ్చేసా!
డాక్టర్: మీ తలనొప్పి ఏమైంది ?
పేషెంటు: నిన్ననే పుట్టింటికి వెళ్ళింది.
మనిషికి నాలుగింటితో అసలు తృప్తి అనేదే వుండదు ఒకటి సెల్ ఫోన్, రెండోది కారు, మూడోది
టీవీ, నాలుగోది భార్య
ఎందుకంటె -
ఎప్పటికప్పుడు వాటిని మించిన బెటర్ మోడళ్ళు మార్కెట్లోకి
వస్తుంటాయి కాబట్టి.
విస్కీ కనుక్కున్నవాడు ఎవడో కానీ దానిలో ఒక సుగుణం వుంది. ఒక
'డబుల్' కడుపులో పడగానే సింగిల్ గా వున్న భావన కలుగుతుంది.
ఆడది కళ్ళు మూసుకుంటే ఆమె మనసుపడే మనిషి కళ్ళల్లో
మెదులుతాడు. అదే మగవాడు కళ్ళు మూసుకుంటే అతగాడు కోరుకునేవారి మొహాలతో ఏకంగా ఒక స్లైడ్ షో మొదలవుతుంది.
ఒక మగవాడి టీ షర్ట్ మీద ఇలా రాసుంది:
ఆడవాళ్ళందరూ రాక్షసులు. కానీ మా ఆవిడ మాత్రం రాణి (చిన్న అక్షరాలలో) ఆ
రాక్షసులందరికీ.
'ఆడవాళ్లకి చెప్పులు అంటే ఎందుకంత మోజు ?
'ఆడవాళ్లకి చెప్పులు అంటే ఎందుకంత మోజు ?
ఎందుకంటె, వాళ్ళు ఎంతగా
లావెక్కినా చెప్పులు మాత్రం సైజు మార్చక్కరలేకుండా కరెక్టుగా సరిపోతాయి'
'ఆడవాళ్ళు సరిగా కారు నడపలేరు అనే అపప్రధ వుంది. నిజమేనా?
'వాళ్ళు మాత్రం ఏంచేస్తారు. కార్లలో ఎటూ చూసినా అద్దాలేనాయే! ఇక
వారికి డ్రైవింగ్ మీద ధ్యాస నిలబడాలంటే కష్టం
కదా!'
'ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకబోతున్న ఆడమనిషిని కాపాడడం ఎలా?
'దగ్గరలో వున్న చీరెల షాపులో తొంభయ్ శాతం సేల్ నడుస్తోందని గట్టిగా అరిచి చెప్పాలి'
'మగవాళ్ళందరూ ఒకే మోస్తరు. ఏం తేడా లేదు' అనే స్త్రీ ఎవరయి
వుంటుంది?'
'మగవాళ్ళ గుంపులో తప్పిపోయిన మొగుడ్ని వెతుక్కునే చైనా అమ్మడు
అయివుంటుంది'
కొందరు మగవాళ్ళు బ్రహ్మచారులుగా వుండిపోయి ప్రపంచంలో జరిగే వింతలన్నింటినీ గమనిస్తుంటారు. మరి కొందరు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో
జరిగేవాటిని వింతగా చూస్తుంటారు.
'ఏమో అనుకుంటాము కానీ గురూ గారూ ఈ ఆడాళ్ళున్నారే, మహా జాదూలు గురూ
గారు?'
'ఎందుకలా అనిపించింది'
'మా ఆవిడతో ఏదైనా మాటలు మొదలు పెడతానా! విషయం ఏదైనా కానీండి. నాకు
తెలీకుండానే దాన్ని వాదులాటలోకి మార్చేస్తుంది'
'మగవారితో పోలిస్తే
ఆడవాళ్ళు మంచి, చక్కటి, ఆహ్లాదకరమైన, జీవితాన్ని చాలాకాలం అనుభవించగలరు
ఎందుకంటారు.?'
'ఎందుకేమిటి మీ
మొహం నా శ్రాద్ధం - వారికి 'భార్యలు' వుండరు కాబట్టి'
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి