16, జులై 2013, మంగళవారం

మళ్ళీ అలానే మొదలయిందిమా ఆవిడ అద్దం ముందు నానా వయ్యారాలు పోతోంది.
అద్దంలోకి అలా చూస్తూ ఇలా చూస్తూ ఒక్కసారి నావైపు చూసింది.
కొంప మునగబోతోందని ఆరో సెన్స్ హెచ్చరించింది.
“అదేవిటండి. ఆ కనబడేది నేనేనంటారా!  ఇంతలా వొళ్ళెలా వచ్చింది. మరీ ఇంత అసయ్యంగా వున్నానంటారా!”
“ఛా! అల్లా అని ఎవరనగలరు? కాకపొతే అద్దం నిజం చెబుతుందని అంటారు”
అంతే!
మా మధ్య తగువు మళ్ళీ అలానే మొదలయింది.“ఈసారి వెడ్డింగ్ యానివర్సరీకి ఎక్కడికి వెడదామంటావు?”
నా ఈ ఆఫరు మా ఆవిడ మోహంలో వెయ్యి మతాబులు వెలిగిస్తుందని తెలుసు.
అనుకున్నట్టే ఎంతో సంతోషపడింది.
“ఎక్కడికయినా సరే! ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళని చోటయితే బాగుంటుంది.”
ఆవిడ కోరుకున్నట్టే  తీసుకువెళ్లాను.
వొంటింటిని  చూడగానే  ఇంతెత్తున  ఎగిరిపడింది.
ఇక చెప్పేదేముంది?

సిగపట్ల యుద్ధం మళ్ళీ అలానే మొదలయింది.

NOTE: Courtesy Cartoonist 

1 వ్యాఖ్య:

hari.S.babu చెప్పారు...

బావున్నయి అలా మొదలైంది సంగతులు:-)