31, జులై 2013, బుధవారం

ఉచిత సలహా

మనకు నచ్చినవన్నీ ఇతరులు మెచ్చుకోవాలని రూలేమీ లేదు. అలాగే ఇతరులకి నచ్చాలని మాత్రమే, లేదా నచ్చేట్టు మాత్రమే  రాయాలని కూడా లేదు. కొన్ని కొందరికి  నచ్చుతాయి. మరికొన్ని ఇంకొందరికి  నచ్చకపోవచ్చు. ఒకరి 'సొద' మరొకరికి 'సోది'లా, 'చాదస్తం'లా అనిపించవచ్చు. అది తప్పేమీ కాదు. కాకపోతే వాటిని చదవడం వల్లా, చదవకపోవడం వల్లా కొంపలేవీ మునిగిపోవు. పూర్వం నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు ఒకాయన ఫోను చేసి ' మీ వార్తలన్నీ చద్ది వార్తలు, చచ్చు వార్తలు' అన్నాడు. నేను కూల్ గా - 'పరిష్కారం మీ చేతి లోనే వుంది' అన్నాను. ఆయన కాస్త తగ్గి ఏవిటన్నట్టు కాసేపు ఆగాడు. 'సింపుల్. రేడియో నాబ్ వెనక్కి తిప్పండి. చచ్చు వార్తలు వినే బాధ తప్పుతుంది'. నా జవాబు ముందు కోపం తెప్పించినా తరువాత అర్ధం చేసుకుని భళ్ళున నవ్వేశాడు. ఆ తరువాత మంచి ఫ్రెండు కూడా అయ్యాడు. కాబట్టి చెప్పేదేమిటంటే - నచ్చినవి అనుకున్నవి చదవండి. నచ్చకపోతే వొదిలేయండి. నేనయితే అంతే చేస్తాను. కాస్త బీపీ కంట్రోల్ లో ఉంటోంది.