16, జులై 2013, మంగళవారం

అలా మొదలయింది .....
తిని కూర్చుని తీరిగ్గా టీవీ చూస్తూ రిమోట్ తో చానల్స్ మారుస్తుంటే పక్కన కూర్చుని పకోడీలు నవులుతున్న మా ఆవిడ అడిగింది. “ఏం చూస్తున్నారు?”
టైం బాగా లేక అన్నాను “టీవీ మీద దుమ్ముని”
అంతే!
రగడ మొదలయింది. వచ్చే నెలలో మా మ్యారేజి  యానివర్సరి.  ఏం కొంటారన్న విషయాన్ని మా ఆవిడ మాటల్లో పెట్టి ఆరా తీస్తోంది. అది నాకు తెలుస్తూనే వుంది.
“మూడే సెకన్లలో జీరో నుంచి వందకు ఎగబాకేది కొంటే ఎలావుంటుంది?” మా ఆవిడ కొస్చెన్.  అంటే కొత్త కారన్న మాట. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని వెర్రి వెధవని కాదుకదా!
కానీ అనేసాను. “ఏవిటి వెయింగ్ మిషన్ కావాలా!”
అంతే! లడాయి మొదలయింది.

రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చాను.
మా ఆవిడ ఏదయినా ఖరీదయిన చోటుకు తీసుకువెళ్లమంది.
తప్పుతుందా! తీసుకువెళ్లాను, పెట్రోలు బంకుకి.
అంతే! పోట్లాట మొదలయింది.