14, మార్చి 2013, గురువారం
వాయిదాల అసెంబ్లీ
లేబుళ్లు:
వాయిదాల అసెంబ్లీ
13, మార్చి 2013, బుధవారం
గ్యాస్ బుకింగ్ సమయంలో జాగ్రత్త!
గ్యాస్ బుకింగ్ చేసేటప్పుడు జర భద్రం! బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే సబ్సిడీ సిలిండర్ గోవిందా. ఇది స్వానుభవం. ఫోటో చూస్తే తెలుస్తుంది.
ఈ స్వానుభవ ఉదంతానికి చిన్న సవరణతో కూడిన వివరణ. అదేమిటంటే మా ఇంట్లో ఈ గ్యాస్ బుకింగ్ వ్యవహారం నా పోర్ట్ ఫోలియో. ఈ రెండు సందర్భాలలో అసలు జరిగినదేమిటంటే - ముందు గ్యాస్ బుక్ చేసాను. సిలిండర్ రాకపోవడంతో వారం పదిరోజులు చూసి మళ్ళీ ఫోను చేసాను. మీ సిలిండర్ ఇప్పటికే డెలివరీ చేయడం జరిగిందని ఓ రికార్డెడ్ వాయిస్ జవాబు చెప్పింది. ఇంట్లోనే వున్నాము. డోర్ లాక్ ప్రసక్తి లేదు. కానీ ఈ గోడు ఆ వాయిస్ వినలేదు కదా. దానితో మళ్ళీ బుక్ చేసాను. అంతకు ముందు డెలివరీ అయిందన్న సిలిండర్ ఎటు పోయిందో తెలియదు కానీ, అది కూడా లెక్కలోకి తీసుకుని కొత్త సిలిండర్ ను సబ్సిడీ కోటాలో చేర్చినట్లులేదు. అదీ మా వాడు వాళ్ల వెబ్ సైట్ లోకి వెళ్ళి చూస్తే తెలిసింది.- భండారు నిర్మలాదేవి W/O భండారు శ్రీనివాసరావు

ఇలా చేసి చూడండి!
ఏవీ తోచడం లేదా? బోరుకొడుతోందా? అచ్చం ఇలాటివాళ్లకోసమే
మన ఘనమయిన పెట్రోలియం మంత్రిత్వ శాఖ వారు లక్షలు ఖర్చుపెట్టి పత్రికల్లో పెద్ద
పెద్ద ప్రకటనలు ఇచ్చారు. గ్యాస్ సబ్సిడీ పొందేందుకు మీ ఆధార్ నంబరును మీ సంబంధిత
గ్యాస్ కంపెనీకి పంపుకోవడానికి కొన్ని విధానాలను పొందుపరిచారు. అందులో ఒకదాంట్లో వేలుపెట్టి
చూసాను. చీమ కుట్టలేదు కాని తల బొప్పికట్టింది. ఆ కధాక్రమం చిత్తగించండి.
రెండు ఎస్.ఎం.ఎస్. లు పంపండి అన్నారు. ఓస్ ఇంతే కదా అనుకున్నాను. వివరాలు,ఉదాహరణలు కూడా చక్కగా
ఇచ్చారు.
మొదటిది: మొబైల్ నెంబరు నమోదు చేసుకోవడానికి – (గ్యాస్ కంపెనీ): IOC/HPC:REG
<స్పేస్> పంపిణీ దారు ఫోను నెంబరు సున్నా లేకుండా <స్పేస్>
వినియోగదారు నెంబరు (ఉదాహరణకు ) REG 117654321 564321)
రెండో ఎస్ ఎం ఎస్ – మీ ఆధార్ నెంబరు మీ నమోదిత మొబైల్
నెంబరు నుంచి పంపండి.
UID<స్పేస్> ఆధార్ నెంబరు (ఉదాహరణకు: UID
343434343434)
ఇంకేం! కాసేపు ప్రయత్నిస్తే పోలా అనిపించి రంగం
లోకి దిగాను అన్ని నెంబర్లు వివరాలు సిద్దంగా వుంచుకుని సిద్దమైపోయాను.
పత్రికా ప్రకటనలో చెప్పింది చెప్పినట్టు అక్షరం
పొల్లుపోకుండా, నెంబర్లు తప్పు పడకుండా ఏకదీక్షగా కూర్చుని పనిపూర్తి చేసాను.
కొద్ది సేపటిలోనే ఎస్.ఎం.ఎస్. వచ్చినట్టు మొబైల్ లో సంకేతం వచ్చింది. ‘అమ్మయ్య
పనిచేసే ప్రభుత్వం’ అని కితాబు ఇచ్చుకుంటూ ఎస్.ఎం.ఎస్. ఓపెన్ చేసాను. అందులో ఇలావుంది:
For Reg. type
HPDistributorPhoneNumberWithSTDCodeConsumerNumber
and send to 9666023456
ఎక్కడో దూడ వేసాననుకుని మళ్ళీ ఓపిగ్గా అవే
వివరాలతో ఎస్ ఎం ఎస్ పంపాను. సమాధానం తిరుగు టపాలో (ఎస్ ఎం ఎస్ లో) ఠక్కున
వచ్చింది. చూస్తే అందులో:
For Reg. type
HPDistributorPhoneNumberWithSTDCodeConsumerNumber
and send to 9666023456
అక్షరం పొల్లు పోకుండా అంతా “SAME TO SAME”
అయ్యా ఇదీ కధ.
ఏవి సేతురా లింగా! (13-03-2013)
లేబుళ్లు:
Aadhar Card link with Gas
12, మార్చి 2013, మంగళవారం
చీరే మేరే సప్నే
లేబుళ్లు:
ఆంధ్ర జ్యోతి,
వాక్టూన్లు,
andhra jyothy
10, మార్చి 2013, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)