7, ఫిబ్రవరి 2022, సోమవారం

ఇబ్బంది పెట్టే సరదాలు – భండారు శ్రీనివాసరావు


ఒకానొక రోజుల్లో నేను టీవీ చర్చలకు  ముప్పూటలా   వెళ్ళే రోజుల్లో...

ఒక టీవీలో చర్చాకార్యక్రమం నిర్వాహకుడు చర్చలో పాల్గొంటున్న ఒకరిని ఇలా సంబోధించారు.

“ఒకప్పటి టీడీపీ నాయకుడిగా, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడిగా ఈ అంశంపై మీ అభిప్రాయం చెప్పండి”

సరదాగా చేసిన ఈ పరిచయ వాక్యం అందర్నీ నవ్వించింది. నిజానికి సీరియస్ చర్చల్లో అప్పుడప్పుడూ ఇలాంటి చమక్కులు అవసరం కూడా. 

అయితే, ఇలాటి పరిచయాలు చేయాల్సివస్తే పాల్గొనే వాళ్లకి కొంత ఇబ్బందే.

ఉదాహరణకు:

“ఒకప్పుడు మీరు కాంగ్రెస్. తరువాత టీడీపీలో చేరారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజులకే ఎన్నికలు రావడం, మీరు టీఆర్ఎస్ లో చేరడం జరిగిపోయాయి. రాష్ట్రం విడిపోవడంతో వైసీపీలో చేరి గెలిచిన తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు ముందు మరో పార్టీ జనసేనలోనో, లేదా మరింత తాజాగా  పెట్టబోయే పేరుపెట్టని మరో పార్తీలోనో చేరుతారనే వార్తలు వినవస్తున్నాయి. ఈ అనుభవ నేపధ్యంలో ఈ అంశంపై మీరు యేమని అనుకుంటున్నారు”

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడు నేను ఏ పార్టీ లో ఉన్నానో ఏమో, ఎప్పుడు ఎందులోకి చెంగున దూకుతానో తెలియదు. అన్ని రంగుల చొక్కాలు, కండువాలు నా బీరువాలో సిద్ధంగా ఉన్నాయి అనుకుంటున్నాను.