2, ఫిబ్రవరి 2022, బుధవారం

హల్వా లేని బడ్జెట్ – భండారు శ్రీనివాసరావు

 

ఢిల్లీ నార్త్ బ్లాక్ లో బడ్జెట్ తయారీ కార్యక్రమం పూర్తయిన రోజున అక్కడ పనిచేసిన సిబ్బందికి ఆర్ధిక మంత్రి హల్వా తినిపించడం సాంప్రదాయం. కోవిడ్ కారణంగా నిరుడు, ఈ ఏడాది హల్వా తయారీకి స్వస్తి చెప్పారు. మిఠాయిలతోనే సరిపుచ్చారు.
బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక అనేది సార్వత్రికంగా ఉన్న అభిప్రాయం. అసలీ పదానికి అర్ధం తోలు సంచీ. బడ్జెట్ ప్రతిని ఓతోలు సంచీ (లెదర్ బ్యాగ్) లో పెట్టుకుని ఆర్ధిక మంత్రి సభకు వస్తారు. డిజిటల్ శకం మొదలయిన తర్వాత దీని సైజు, స్వరూపం పూర్తిగా మారి పోయింది.బడ్జెట్ తయారీ, ముద్రణలో పాల్గొనే సిబ్బంది అందరూ, కొన్ని రోజుల పాటు తమ కుటుంబాలకు దూరంగా నార్త్ బ్లాకులో వుండిపోతారు. తిండీ నిద్రా అంతా ఆఫీసులోనే. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు.
బడ్జెట్ ప్రతులు ముద్రించడానికి ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మిషిన్ కూడా నార్త్ బ్లాకులోనే వుంటుంది.
మరి ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆ యంత్రాలను వాడుతున్నారో లేదో తెలియదు.
(02-02-2022)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బడ్జెట్ లో యథాప్రకారం గా తెలుగు రాష్ట్రాలకు కుర్రో కుర్రు. ఈ బడ్జెట్ వార్తలు తెలుసుకోవడం కంటే హల్వా చేసుకుని తినడం మేలు.