3, అక్టోబర్ 2018, బుధవారం

వారాలబ్బాయి – భండారు శ్రీనివాసరావు


టీవీల వాళ్ళు నాకు పెట్టిన పేరు వారాలబ్బాయి. అంటే రోజుకొక ఛానల్. ఈరోజు ఒక టీవీకి వెడితే మళ్ళీ వారం తర్వాతే ఉదయం పూట ఆ ఛానల్ కి వెళ్ళడం.  అది చార్టు వేస్తే ఇలా వుంటుంది:
(సోమవారం నుంచి ఆదివారం వరకు)
Monday – AP 24 X 7 – From 7.30 am to 9 am. (మార్నింగ్ డిబేట్ విత్ వెంకట కృష్ణ)
Tuesday – NTV – 7.30 am to 8.39 am (బిగ్ డిబేట్)
Wednesday – T. News – 7.30 am to 8.30 am (వార్తలు, వాస్తవాలు)
Thursday – Sneha – 7.30 am to 8.45 am (One to One debate, న్యూస్  టాక్)
Thursday – Sakshi – 7.30 pm to 8.30 pm (Amar’s Fourth Estate)
Friday – Maha News – 7.00 am 8.30 am ( సన్ రైజ్ షో)
Saturday-  ABN Andhra Jyothy – 7.00 am to 8 am. (పబ్లిక్ పాయింట్)
Sunday – TV 5 – 7.30 am to 9 am (న్యూస్ స్కాన్)
(ఇప్పుడిదంతా ఎందుకంటే ఈ మధ్య మీరు కనిపించడం లేదేమిటి అంటూ కొందరు  మెసేజులు పెడుతున్నారు.  ఒక రోజు కనబడకపోతే మళ్ళీ వారం తిరిగేదాకా వీలు కుదరదు అని చెప్పడానికి మాత్రమే సుమా!)

8 కామెంట్‌లు:

ప్రసాద్ శర్మ చెప్పారు...

సార్, మీరొక విజ్ఞాన ఖని, మాటల మాంత్రికుడు, సమకాలీన రాజకీయాల పైన సాధికారికంగా విస్లేశించగల దిట్ట. మీరున్న చర్చలు బాగా రక్తి కడతాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇతర వక్తలు మిమ్మల్ని ఇంటర్సెప్ట్ చేసే ధైర్యం చేయలేరు. మీరు కూడా ఇంకొక వక్గ్త మాట్టాడుతున్నప్పుడు జోక్యం చేసుకోరు. మీరు చానల్స్ మ్యానర్స్ పెట్టింది పేరు. మిమ్మల్ని వారాలబ్బాయి అని పిలవడానికి చానల్స్ వాళ్ళకు ఎన్ని గుండెలు ? మీకు మీరే ఆ రకంగా ఆపాదించుకుంటున్నారు తప్ప ! ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ హంబుల్ నెస్ బట్ నతింగ్ ఎల్స్ !!
మీ శిష్య పరమాణువు
ప్రసాద్ శర్మ

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆనందం. ఎప్పుడైనా మీ ఇంటికి రావాలనుకుంటే మీరు ... కనీసం ... ప్రాథమికంగా ... ఎప్పుడు దొరకరో ఈ ఛార్ట్ చూసి తెలుసుకోవచ్చు (ఇతర టైముల్లో కూడా కొన్నిసార్లు దొరక్కపోవచ్చు లెండి, అది వేరే సంగతి 😀). అన్నట్లు ఇవన్నీ లైవ్ ప్రోగ్రాంలే కదా?
Tuesday దాంట్లో 8.39 am అని ఉంది. అది 8.30 am అనుండాలేమో? ఒక్క గురువారం నాడు మాత్రం “సాక్షి” లో సాయంత్రం ప్రోగ్రామ్ అని తెలుస్తోంది, దేవులపల్లి అమర్ గారు ఉదయం ప్రోగ్రాం చెయ్యట్లేదన్నమాట (టీవీ చర్చలు నేను చూడను లెండి, వాటిల్లో మీరున్నా కూడా. అందుకని నాకు పెద్ద ఐడియా లేదు. పైన ప్రసాద్ శర్మ గారన్నట్లు మీరు హుందాగానే ఉంటారు గానీ కొంతమందివి ఆ అరుపులు, కేకలు, ఆ babel నేను భరించలేను ... అందునా పొద్దుటే 🙁).
Anyway మీ షెడ్యూల్ చెప్పినందుకు థాంక్స్.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ప్రసాద శర్మకు ధన్యవాదాలు. వారాలబ్బాయి పెరునేను పెట్టిందే. పాపం వాళ్లకు సంబంధం లేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@విన్నకోట నరసింహారావు గారు - మీ నిశిత పరిశీలనకు నమోవాకాలు. నిజమే. అచ్చు తప్పు 39 కాదు, 30

సూర్య చెప్పారు...

ఇలా వ్యక్తిగత సమాచారం నెట్టంతా వేదజల్లెయడమేనా?ట్రంప్ నీ కిమ్ నీ చూసి నేర్చుకోండి సార్!ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తారో రెండో కంటికి కూడా తెలియదు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

నేను ఉద్యోగం చేసిన ఆఫీస్ లో ఎమ్.డీ. గారి సెక్రటరీ మహా గోప్యంగా ఉండేవాడు ... ఆఫీస్ లో కొంత గోప్యత అవసరమే గానీ ఈయన మాత్రం ఏదో దేశరహస్యాలు తనే కాపాడుతున్న లెవల్ లో వ్యవహరించేవాడు. అతని గురించి మా ఆఫీస్ లో ఒక జోక్ ఉండేది -- ఏమంటే ... ఆ సెక్రటరీ గారికి ప్రతిదీ ఎంత రహస్యం అంటేనండీ ... ఎమ్.డి. గారి టూర్ ప్రోగ్రాం ఎమ్.డి. గారికి కూడా చెప్పడు ... అని 😀😀.

Chiru Dreams చెప్పారు...

ఎమ్.డి. గారి టూర్ ప్రోగ్రాం ఎమ్.డి. గారికి కూడా చెప్పడు. ⚡ ⚡ ⚡

నీహారిక చెప్పారు...

ట్రంప్ నీ కిమ్ నీ చూసి నేర్చుకోండి సార్!ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తారో రెండో కంటికి కూడా తెలియదు.

రాహుల్ గాంధీ, నీహారికలను కూడా చేర్చండి. కట్టుదిట్టమైన (అ)భద్రతల మధ్య ఊపిరాడక ఎవరికీ చెప్పాపెట్టకుండా పారిపోవాలనిపిస్తుంది.రెండు రాష్ట్రాల పోలీసు అధికారుల సాయంతో వెతికి తెచ్చుకుంటారు.