2, జూన్ 2016, గురువారం

జవాబు లేని ప్రశ్న


ఏ రాజకీయ నాయకుడికీ మినహాయింపు లేని వాస్తవం ఇది.
నాయకులను అధికార పీఠం మీద కూర్చోబెట్టేది ప్రజలు. అధికారానికి దగ్గర చేసేది ప్రజలు.
ఆ అధికారమే వారిని మళ్ళీ  ప్రజలకు దూరం చేయడం ఓ చిత్రం!
వారువీరని కాదు ఏ రాజకీయ నాయకుడయినా అధికారంలో లేనప్పుడు ప్రజలకు దగ్గరగా తిరిగిన రోజులు  గుర్తు చేసుకోండి.
అదే వ్యక్తులు అధికారంలోకి రాగానే వారికీ, ప్రజలకు నడుమ సెక్యూరిటీ పేరుతొ అడ్డం నిలిచిన బారికేడ్లను గమనించండి.
ఈ నిజం అర్ధం అవుతుంది.

అధికారానికి కారకులయిన వారే, వారి ప్రాణాలకు ముప్పుగా మారుతారా!
ఏమో!    

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

రాజకీయులు (అవసరమైతే (ఎవరికి?)) ప్రాణాల్ని పణంగాపెట్టి ఐనా సరే అధికారాన్ని సంపాదించుకోవటానికి తాపత్రయపడతారు. అందుకే మహాప్రజాప్రేమికుల్లాగా జనంలోకి దూకిమరీ ప్రచారం చేసుకుంటారు తమ (వద్ద లేని) గుణగణాల్ని గొప్పగా.

అధికారం సంపాదించుకున్నాక అదే రాజకీయులు అదేప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి ఐనా సరే తమ(?) అధికారాల్ని, అస్తిత్వాల్ని కాపాడుకోవటానికి తాపత్రయపడుతూ ఉంటారు. అందుకే ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉన్నా ఫరవాలేదు కాని తమసౌకర్యానికి ఇబ్బంది కాకుండా ఉండటానికి భద్రతాసిబ్బంది సహాయంతో ప్రజల్ని వీలైనంత దూరంగా ఉంచుతూ దర్జావెలిగిస్తూ ఉంటారు.