13, జూన్ 2016, సోమవారం

ముసలి మొగుడు – పడుచు పెళ్ళాం


ఓ ముసలాయన చేపలు పట్టడానికి వెళ్ళాడు.  గాలం వేసి ఎదురుచూస్తుంటే ఒక కమ్మని స్వరం నీళ్ళల్లో నుంచి వినిపించింది. ‘ ఓ మానవా నన్ను బయటకు లాగు ఒడ్డున పడెయ్యి’
ఆతగాడు గాలం  లాగి చూస్తే దాని కొక్కేనికి ఒక కప్ప చిక్కుకుని కనిపించింది. 

ఆ కప్ప ఇంకా  ఇలా అంది. ‘నన్ను కాపాడు. నేను భూమి మీదకు రాగానే నన్ను గట్టిగా ముద్దుపెట్టుకో. ఒక అందమయిన అమ్మాయిగా మారిపోయి నీ ఇల్లాలుగా నీతోనే  జీవితాంతం వుండి పోతాను’
ముసలాడు జాలిపడి కప్పను ఒడ్డుకు చేర్చాడు. దాన్ని మెల్లగా నిమిరి తన జేబులో వేసుకోబోయాడు. కప్ప కంగారుగా అంది.’ ఓ మానవా! నేను చెప్పింది సరిగా వినలేదా. నన్ను ముద్దు పెట్టుకో. ఓ అందమయిన అమ్మాయిగా మారి నీ ఇల్లాలుగా వుండి పోతాను. సౌందర్యవతి అయిన భార్య తోడుగా వుంటే నీకూ సంఘంలో గొప్పగా వుంటుంది’
ముసలాడు బోసినవ్వు నవ్వి ఇలా అన్నాడు.

‘ఈ వయస్సులో ఓ పడుచుపిల్లను  భార్యగా భరించడం కంటే, ఇలా మాట్లాడే కప్పను  దగ్గర వుంచుకుంటే  ఇంకా గొప్పగా వుంటుంది’   

NOTE: COURTESY IMAGE OWNER

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

హ హ్హ హ్హ, ఒకప్పటి పాప్యులర్ రచయిత James Hadley Chase నవలల్లో చాలామటుకు ఇదే ప్రధానాంశం కదా - ముసలి మొగుడు, పడుచు పెళ్ళాం, యువకుడైన కార్ డ్రైవరో మరొకరో, ముసలి మొగుడి హత్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం క్లెయిం, ఇన్సూరెన్స్ వారి పోలీస్ వారి దర్యాప్తు వగైరా 🙂. When an old man marries a lovely girl half his age, the writing goes up on the wall for him అంటుంటాడు నవల్లో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారి.

మీ కథలో ముసలివాడు మాత్రం తెలివయినవాడులా ఉన్నాడులెండి. 😀