16, జూన్ 2016, గురువారం

నవ్వు నాలుగందాల చేటు


ఈ చాటువుకి సరయిన అర్ధం అర్ధం కావాలంటే ఓసారి అసోం వెళ్లి రావాలి.

అక్కడ పారిమొండా అనే ఆదివాసీ తెగవారు శత్రువులను మట్టుబెట్టడం కోసం ‘నవ్వు’ ఆయుధాన్ని  ప్రయోగిస్తారుట. స్కెడి అనే ఓ వనమూలిక రసాన్ని మద్యంలో కలిపి ఇస్తారట. అది సేవించిన వాళ్ళకు ముందు మత్తు  తలకెక్కుతుంది. తరువాత, క్రమంగా  ఆ మూలిక పనిచేసి, అదేపనిగా ఆపకుండా  నవ్వడం మొదలెడతారు. ఎంతగా నవ్వుతారంటే నవ్వి నవ్వి అలసిసొలసి డొక్కలు అంటుకు పోయేలా నవ్వి, ఆ నవ్వుతోనే కుంగి, కృశించి ప్రాణాలు ఒదులుతారట. 

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగులో ఇలాంటి చిల్లర విషయాలు ఎందుకు రాస్తున్నారు?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: టోకున రాయలేక

Dileep.M చెప్పారు...

బ్లాగు అంటేనే అజెండా లేనిది అని. Sir, Please continue to write whatever you want.
Anyway I enjoyed this post.

mee kosam చెప్పారు...

హహ..హహా
వార్తాహరునితో పెట్టుకుంటే...హరీ యే