సెక్యూరిటీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సెక్యూరిటీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జూన్ 2016, మంగళవారం

ప్రాణం విలువ పెరుగుతోందా!


ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో ప్రజల  మధ్యనే తిరుగుతూ ‘ఆఖరి నెత్తురు బొట్టు వరకు ప్రజలకొరకు పోరాడతాం’ అనే రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే అంగరక్షకుల వలయాల నడుమ జీవిస్తూ తమను గద్దె నెక్కించిన ప్రజలకు దూరం అవుతూ వుండడం మనం చూస్తూ వున్నాం.
ఇందుకు మినహాయింపులు కూడా లేకపోలేదు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పీవీ హయాములో మొదటి సారి కేంద్ర ఆర్ధిక మంత్రి అయ్యారు. ముంబైలో స్టేట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి ఠంచనుగా వచ్చారు. బ్యాంకు చైర్మన్ తో సహా సీనియర్ అధికారులందరూ ఎదురు చూస్తుండగా ఒక అంబాసిడర్ కారు వచ్చింది. అందులో నుంచి మన్మోహన్ సింగ్ కారు తలుపు తీసుకుని కిందికి దిగారు. వెంట ఒక పియ్యే, డ్రైవర్ ఇంతే సిబ్బంది. వెనుక ఒక పోలీసు జీపులో ఒక ఇనస్పెక్టర్, ఒక కనిస్టీబు, ఇంతే సెక్యూరిటీ.

అది చూసి బ్యాంకు అధికారులు నివ్వెర పోయారు. అంతకు ముందు వారు అనేకమంది ఆర్ధిక మంత్రుల హంగూ, ఆర్భాటం ఎరిగిన వారు కనుకనే వారిలో ఈ నివ్వెరపాటు.

2, జూన్ 2016, గురువారం

జవాబు లేని ప్రశ్న


ఏ రాజకీయ నాయకుడికీ మినహాయింపు లేని వాస్తవం ఇది.
నాయకులను అధికార పీఠం మీద కూర్చోబెట్టేది ప్రజలు. అధికారానికి దగ్గర చేసేది ప్రజలు.
ఆ అధికారమే వారిని మళ్ళీ  ప్రజలకు దూరం చేయడం ఓ చిత్రం!
వారువీరని కాదు ఏ రాజకీయ నాయకుడయినా అధికారంలో లేనప్పుడు ప్రజలకు దగ్గరగా తిరిగిన రోజులు  గుర్తు చేసుకోండి.
అదే వ్యక్తులు అధికారంలోకి రాగానే వారికీ, ప్రజలకు నడుమ సెక్యూరిటీ పేరుతొ అడ్డం నిలిచిన బారికేడ్లను గమనించండి.
ఈ నిజం అర్ధం అవుతుంది.

అధికారానికి కారకులయిన వారే, వారి ప్రాణాలకు ముప్పుగా మారుతారా!
ఏమో!