28, అక్టోబర్ 2013, సోమవారం

నేనెందుకు పత్రికల్లో రాయడం లేదు?


నా బ్లాగులో రాసేవాటిని చదివే పాఠకులు చాలామంది మీరు యెందుకు పత్రికల్లో రాయరు? అని ఈ మెయిల్స్ పంపుతుంటారు. దానికి కారణం నా వయస్సే. ఓ పదేళ్లు పెద్దవాడిని అయినా లేదా ఓ పదేళ్లు చిన్నవాడిని అయినా నాకు ఈ సమస్య వచ్చి వుండేది కాదేమో. ఈనాడు పత్రికలకు ఎడిటర్లుగా వుంటున్నవారు చాలామంది నాకన్నా ‘వయస్సులో’ చిన్నవాళ్ళు. అలా అని మరీ చిన్నవాళ్ళేమీ కాదు. అంచేత రాయమని వాళ్లు నన్ను అడగలేరు. రాస్తానని నేను వాళ్ళతో చెప్పలేను. జర్నలిష్టులనే వాళ్లకి ఏమున్నా లేకపోయినా ఈ ‘గోరోజనానికి’ మాత్రం ఏం తక్కువ వుండదు. ప్రత్యేకించి నాలాటి వాళ్లకు. కొన్నాళ్ళు ఓ దినపత్రిక వాళ్లు వారం వారం వెంటబడి మరీ అడిగి రాయించుకున్నారు. రాయడం తప్ప ‘ఇచ్చిపుచ్చుకునే’ వొప్పందం ఏమీ లేదు. పైగా రాసిన దానికి ఇంత అని లెక్క కట్టి టీసుకుంటే ఆ రచనకు విలువ అంతటితో సరి – అమరావతి లింగం మీద మేకు కొట్టినట్టే – అని  నమ్మేవాడిని నేను. కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఓసారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాసిన ఓ  వ్యాఖ్య వారి యజమానికి నచ్చలేదు. ‘అందువల్ల వేయడం లేదు’ అని ఫోను చేసి మరీ  చెప్పారు. ‘అంచేతే నేనూ  ఇకనుంచి  మీకు రాయను గాక రాయను’  అని చెప్పేశాను. ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా నా పాలసీ అదే. దాంతో వాళ్లు కూడా అడగడం మానుకున్నారు. నిజానికి మార్కెట్లో రాసేవాళ్ళ కొరత ఏమీ లేదు కదా!
పోతే ఈ ఉపోద్ఘాతానికి కారణం లేకపోలేదు. మీ అందరి అభిమానం వల్ల నా బ్లాగు వీక్షకుల సంఖ్య నేటికి రెండు లక్షలు దాటింది. పత్రికలమీద ఆధారపడే పనేవుంది చెప్పండి.

నిజంగా నేనిప్పుడు అక్షరాలా  ‘లక్షాధికారి’ని.’ నన్ను ఇలా ఇన్ని  లక్షలకు అధిపతిని చేసిన అందరికీ మరోమారు మనః పూర్వక కృతజ్ఞతలు.


 భండారు శ్రీనివాసరావు
 (28-10-2013)

   


8 కామెంట్‌లు:

astrojoyd చెప్పారు...

regdng ur word gorojanam--if ones writings has good content,there is a gorojanam in that writer so dont confess on it sir..i have seen several writers nd journalists wthout basic knowledge in journalisam.Not only that most of them r copy cats too..

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@astrojoyd - Thanks

hari.S.babu చెప్పారు...

నిజమే, ఇవ్వాళ ప్రతిభ ఉండి దానితో పాటు స్వాభిమానం కూడా ఉంటే అతన్ని హుందా అయిన పధ్ధతిలో ఇముడ్చుకోగైగిన జీవనరంగం - జర్నలిసం కానివ్వండి, కార్పొరేట్ రంగం కానివ్వండి, మరియు రాజకీయ రంగం కానివ్వండి - యేదీ లేదు. ఇప్పుడే కాదు, అసలెప్పుడూ లేదేమో? అప్పటిదాకా రాజులుగా ఉన్న పాందవులకి ఆజ్ఞాతవాసం చెయ్యడానికి ముందు ధౌమ్యుల వారు చెప్పిన మాటలు అవే, ఉద్యోగి యెలా ఉండాలి అని.అప్పటి నుంచీ ఇప్పటి వరకూ అద్దే అధ్ధతి, అయినా కాలం మారిపోయిందనే భ్రమలో ఉన్నామేమో! మన చుట్టొ ఉన్న వస్తుజాలం మారింది, భావజాలం మారలేదు. కాదా!!

hari.S.babu చెప్పారు...

లక్ష టపార్చన పూర్తయిందన్నమాట! మంచి పార్టీ ఇస్తారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@hariSbabu - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

hariSbabu గారు చెప్పినది అక్షరాలా నిజం. కాలం ఏమీ మారలేదు. ప్రజల వేషభాషలు మారాయి / విమానాల్లో తిరుగుతున్నారు / సెల్ ఫోన్ లు, కంప్యూటర్ లు వాడుతున్నారు - కానీ ఫ్యూడల్ మనస్తత్వం మాత్రం పోలేదు. మారకపోగా ఆ మనస్తత్వాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారనిపిస్తుంది.

అజ్ఞాత చెప్పారు...

ఇంతకూ మీ ఆర్టికల్‌ను ప్రచురించం అన్న పత్రిక ఏదీ? ఈనాడే కదా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత - ఈనాడు కాదు - భండారు శ్రీనివాసరావు