KYC లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
KYC లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, సెప్టెంబర్ 2021, మంగళవారం

IS STILL STATE BANK, OUR BANK ?

 1975 నవంబరులో నేను హైదరాబాదు ఆలిండియా రేడియో, న్యూస్ యూనిట్ లో చేరినప్పుడు మొదటి నెల జీతం నగదు రూపంలో ఇస్తూ క్యాషియర్ సలహా ఇచ్చాడు, ఏదైనా బ్యాంకులో ఖాతా తెరిచి ఆ వివరాలు ఇమ్మని. రేడియో అక్కౌంట్ కోటీ, బ్యాంక్ స్ట్రీట్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకల్ హెడ్ ఆఫీసులో వుంది. అక్కడికి వెళ్లి పలానా చోట పనిచేస్తున్నాను అని చెప్పాను. బ్యాంకు మేనేజరే నాకు రిఫరెన్స్ సంతకం చేయడంతో వెంటనే అక్కౌంట్ ఓపెన్ చేయగలిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నలభయ్ ఆరేళ్లుగా నా అక్కౌంట్ ఆ బ్రాంచిలోనే వుంది. ఎన్నో ఇళ్లు మారాను కానీ బ్యాంకు అక్కౌంట్ వేరే బ్రాంచికి మార్చలేదు. ఈ క్రమంలో అక్కడ పనిచేసేవాళ్ళు సిబ్బంది, అధికారులు  పరిచయం అయ్యారు. రిటైర్ అయిన తర్వాత కూడా అదే బ్యాంకు. అదే బ్రాంచి. ఆ బ్యాంకు యాడ్స్ లో పేర్కొన్నట్టు “STATE BANK MY BANK.

కొద్దిసేపటి క్రితం ఒకతను ఫోన్ చేశాడు, ‘కోటీ ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నాను, మీ వివరాలు చెప్పండ’ని.

నేను అన్నాను. ‘ప్రతి పది రోజులకి  బ్యాంకు నుంచి ఓ మెసేజ్ వస్తుంటుంది, వేరేవారికి మీ వివరాలు చెప్పొద్దు, బ్యాంకు ఎన్నడూ అలాంటివి అడగదు అని. మరి మీరేమిటి, పేరు డిజిగ్నేషన్ కూడా చెప్పకుండా! నా మెయిల్ ఐ డి మీ దగ్గర వుంది, ఏదైనా కావాలి అంటే మెయిల్ చేయొచ్చు కదా’ అని.

అతగాడు అన్నాడు, ‘మీరు నేను చెప్పేది వింటారా, మీరు చెప్పేదే నేను వినాలా’ అని.

‘చాలాకాలం నుంచి మీ కష్టమర్ గా ఉంటున్నాను, కనీసం ఆ అవకాశం నాకెందుకు ఇవ్వరు’ అని అడిగాను.

‘మీరు చెబుతారా కాల్ కట్ చేయమంటారా’ అని కాస్త గద్దింపుగా అన్నాడు. ‘ఫోన్ చేసింది మీరు నన్ను అడుగుతారేమిటి’ అనేది నా జవాబు.

వెంటనే కాల్ కట్ చేశాడు.

అతడు నిజమైన బ్యాంకు ఉద్యోగే అయి ఉండవచ్చు. కానీ ఫోన్ చేసి తన పేరు, హోదా ప్రవర చెప్పుకుని పలానా శ్రీనివాసరావుతోనే మాట్లాడుతున్నాను అనేది వెరిఫై చేసుకుని సంభాషణ సాగించి వుంటే ఈ తకరారు వచ్చేదే కాదు. (అతడు ఫోన్  చేసిన  నెంబరు ల్యాండ్ లైన్ నుంచి. 04023466703)

పైగా ఎంతో కాలం క్రితమే నేను నా బ్యాంకు ఖాతాను అటు ఆధార్ తో, ఇటు నా మొబైల్ తో లింక్ చేశాను కూడా.

అయినా ఇప్పుడీ  ఈ వివరాల ఆరాలు ఎందుకో ఏమిటో మరి.