నవ్వు ముందు కనబడుతుంది. తర్వాత ఆయన కనబడతాడు.
ఆయనే
పేరే రాంబాబు. సీతా రాంబాబు. చెన్నూరి సీతారాంబాబు. ఆఫీసు రికార్డ్స్ లో వేరే పొడుగు
పేరు ఏమైనా ఉందేమో తెలవదు. వున్నా ఆయన అందరికీ రాంబాబే. నాకయితే నవ్వుల రేడు.
నవ్వుకు రిటైర్ మెంట్ ఉంటుందా! వుండదు. వుండకూడదు.
అంచేత ఈరోజు రేడియోలో రాంబాబు గారికి ఇస్తున్న వీడ్కోలు
ఓ లాంఛనం మాత్రమే. ఆయన చిరుదరహాసం మాత్రం పర్మనెంట్.
రాంబాబు గారి మందహాస వదనం చూడడానికి ఈరోజు పుట్టిల్లు
రేడియోకి వెళ్ళాలనే వుంది. ఎలా కుదురుతుందో ఏమో!
రాంబాబు గారికి ముందస్తు శుభాకాంక్షలు.
భండారు శ్రీనివాసరావు
(30-09-2021)