ఈ
అంశాలపై తీవ్రమైన చర్చ సాగుతోంది.
రద్దు చేసే అధికారం వుంది అని
వాదించేవాళ్ళతో ఏ చిక్కూ లేదు. కానీ లేదనే వాళ్ళు ఒక వాదం చెబుతున్నారు. ఒక రూపాయి
నోటు మీద ఫైనాన్స్ సెక్రెటరీ సంతకం వుంటుంది. అదే అంతకు మించిన విలువకలిగిన
నోట్లమీద ‘ఇది ప్రామిసరీ నోటు. ఇది కలిగిన వాళ్లకు అదే విలువను తిరిగి
చెల్లిస్తామని రిజర్వ్ బ్యాంకు పూచీ ఇస్తున్నట్టు రాసివుంటుంది.
(I PROMISE
TO PAY THE BEARER THE SUM OF ONE HUNDRED RUPEES/ FIVE HUNDRED RUPEES/ ONE
THOUSAND RUPEES) ప్రామిసరీ నోటు చెల్లుబడికి కొంత కాల
వ్యవధి వుంటుంది. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోటు కు కాల వ్యవధి వుండదు. ఒకవేళ
కాలదోషం పడితే అంటే బాగా నలిగిపోయి చిరిగిపోయే స్థితికి చేరుకుంటే దాన్ని రిజర్వ్
బ్యాంకులో ఇచ్చి కొత్త నోటు తీసుకునే వీలుంది. ప్రభుత్వాలకు కరెన్సీని చెలామణీ
నుంచి తప్పించే అధికారం వుంటుంది కానీ వాటిని పూర్తిగా రద్దుచేసే అధికారం లేదన్నది
వారి వాదన. పాత నోటు అంటే చెలామణీ నుంచి తప్పించిన నోటుకి బదులు వేరే నోటు
ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సి వుంటుంది. బ్యాంకులు డిపాజిట్ చేయడానికి తిరస్కరించ కూడదు
అనేది వారి అభిప్రాయం. కాకపొతే, అలాంటి డిపాజిట్ దారులని ఆదాయపు పన్ను శాఖ
ప్రశ్నించే వీలుంటుంది.
ఈ వాదన ఎంతవరకు సబబు అనేది ఇటువంటి
ఆర్ధిక విషయాల్లో నిష్ణాతులయిన వాళ్ళే చెప్పాలి
NOTE: COURTESY IMAGE OWNER
